పవన్ ఫ్యాన్స్‌కు మరో షాకింగ్ గిఫ్ట్: అర్ధరాత్రి ఆ సమయానికా?
దాదాపు రెండున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎప్పుడూ లేని విధంగా వరుసగా సినిమాల మీద సినిమాలను చేసుకుంటూ జెట్ స్పీడుతో దూసుకుపోతోన్నాడు బడా హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ.. ఏకకాలంలోనే చాలా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుని దూసుకెళ్తోన్నాడు. ఇలా పవన్ ఇప్పుడు నటిస్తోన్న చిత్రాల్లో టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న 'హరిహర వీరమల్లు' ఒకటి. మొగల్ చక్రవర్తుల కాలం నాటి కథతో రూపొందుతోన్న ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తీస్తున్నారు. దీంతో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి.
అత్యంత భారీ బడ్జెట్‌తో రాబోతున్న 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ ఎప్పుడో షురూ అయింది. కానీ, పవన్ కల్యాణ్ డేట్స్ కేటాయించకపోవడంతో పాటు అనివార్య కారణాల వల్ల షూటింగ్‌కు చాలా బ్రేకులు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో టాకీ పార్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే పవన్ కల్యాణ్ కూడా సరికొత్త ప్రణాళికలతో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, షూట్ మాత్రం పున: ప్రారంభం కావట్లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఓ గుడ్ న్యూస్ వచ్చేసింది.

'హరిహర వీరమల్లు' షూటింగ్ లేకపోవడంతో అసలు ఈ సినిమా ఉంటుందా? ఉండదా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ చిత్రం నుంచి ఓ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు తాజాగా ప్రకటన వెలువడింది. ఇందులో ఈ సినిమా నుంచి బ్రాండ్ న్యూ పోస్టర్‌ను సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 12:17 గంటలకు అంటే ఈరోజు అర్ధరాత్రి వదలబోతున్నారు. సర్‌ప్రైజ్ గిఫ్ట్ వరకూ బాగానే ఉన్నా.. చిత్ర యూనిట్ ఫిక్స్ చేసిన టైంపై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
ఇదిలా ఉండగా.. పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది. ఇందులో నిధి అగర్వాల్ కీలక పాత్రను చేస్తోంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











