శివరాత్రికి హరిహర వీరమల్లు సర్‌ప్రైజ్: టీజర్ కాదు.. ఏకంగా అదే రిలీజ్
గతంలో కంటే ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాల మీద సినిమాలను చేసుకుంటూ యమ స్పీడుతో దూసుకుపోతోన్నాడు టాలీవుడ్ బడా హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఒకవైపు రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. ఏకకాలంలోనే చాలా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ సత్తా చాటుతోన్నాడు. అయితే, ప్రస్తుతం ఒకే ఒక్క చిత్రంలోనే నటిస్తున్నాడు. అదే.. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న 'హరిహర వీరమల్లు'. మొగల్ చక్రవర్తుల కాలం నాటి కథతో రూపొందుతోన్న ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తీస్తున్నారు. దీంతో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
క్రేజీ కాన్సెప్టుతో రాబోతున్న 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ ఎప్పుడో షురూ అయింది. కానీ, పవన్ కల్యాణ్ డేట్స్ కేటాయించకపోవడంతో పాటు అనివార్య కారణాల వల్ల షూటింగ్‌కు చాలా ఆటంకాలు ఎదురయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో టాకీ పార్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే షెడ్యూళ్లను ప్లాన్ చేసుకుంటూ వస్తోంది. ఇందులో భాగంగానే పవన్ కల్యాణ్ కూడా సరికొత్త ప్రణాళికలతో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.

వాస్తవానికి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' మూవీ కొత్త గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత రిపబ్లిక్ డేకు వచ్చే ఛాన్స్ ఉందని టాక్ వినిపించింది. కానీ, అలా జరగలేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. దీన్ని మహా శివరాత్రి పండుగను పురస్కరించుకుని ఫిబ్రవరి 18వ తేదీన రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ప్రకటన ఈ రెండు మూడు రోజుల్లోనే వస్తుందని కూడా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇది పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
ఇక.. పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది. ఇందులో నిధి అగర్వాల్ కీలక పాత్రను చేస్తోంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. దీన్ని వేసవిలో విడుదల చేసే ఛాన్స్ ఉంది.


Click it and Unblock the Notifications











