హరిహర వీరమల్లు ఫ్లెక్సీల తొలగింపు.. బాలినేనిపై కత్తి దూసిన టీడీపీ నేతలు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథా నాయకుడిగా నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్‌కు సిద్దమైంది. పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో కొనసాగుతున్నాయి. అనేక అవాంతరాలు, అడ్డంకులను దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నకోట్లాది మంది అభిమానుల ముందుకు ఈ సినిమా వచ్చేందుకు సిద్దమైంది. అయితే ఒంగోలులో ఈ సినిమా ప్రమోషన్స్ వ్యవహారం మిత్ర పక్షాలు టీడీపీ, జనసేన నేతల మధ్య చిచ్చు పెట్టినట్టయింది. ఈ ప్రాంతంలో నేతల కుమ్ములాటలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

మాజీ వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్‌రడ్డి జనసేన పార్టీలోకి రావడం అన్ని వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఆయన కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే ఈ నాయకుడు అనూహ్యంగా ఆ పార్టీకి దూరమై జనసేనల చేరడం అత్యంత చర్చనీయాంశమైంది. రాజకీయాల్లో అతడి నిర్ణయం ప్రకంపనలు సృష్టించాయి. జగన్ క్యాంపులో కలవరానికి గురి చేసింది.

Harihara Veeramallu flexi removal

అయితే గత కొద్దికాలంగా బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో లోప్రొఫైల్‌లో తన ఉనికిని కొనసాగిస్తున్నారు. అలాగే పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు. పార్టీ అధినేతపై సమయం చిక్కినప్పుడల్లా తన నియోజకవర్గంలో అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. అయితే బాలినేని వ్యవహారం స్థానిక టీడీపీ నేతలకు మింగుపడని విషయంగా మారిందని రాజకీయ వర్గాలు పేర్కొంటాయి. అయితే వైసీపీలో ఉన్న సమయంలో టీడీపీని టార్గెట్ చేయడమే అందుకు కారణంగా చెప్పుకొంటారు.

అయితే తమ అధినేత పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్‌కు ముస్తాబైంది. ఈ నేపథ్యంలో తన నియోజకవర్గంలోను, తన పట్టణం ఒంగోలులో పవన్ కల్యాణ్‌తో తాను ఉన్న ఫోటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీల ఏర్పాటు పలు అభ్యంతరాలకు దారి తీసింది. స్థానికంగా టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పాత వైరాన్ని దృష్టిలో పెట్టుకొని బాలినేని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడం వివాదాస్పదంగా మారింది.

హరిహర వీరమల్లు రిలీజ్ సందర్భంగా బాలినేని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ వ్యవహారంపై అటు జనసేన గానీ, టీడీపీ నాయకత్వం స్పందించకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనపై బాలినేని కూడా కామెంట్ చేయలేదు. ఆ ఘటనపై ఆయన వర్గం కూడా రాద్దాంతం చేయకపోవడం వెనుక ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకొనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X