హరిహర వీరమల్లు గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్.. పవన్ ఫ్యాన్స్‌కు రెండు పండుగలు ఖాయం

తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ సుదీర్ఘ కాలంగా టాప్ హీరోగా దూసుకుపోతోన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. సినిమాల్లోకి కమ్‌బ్యాక్ అయిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తోన్న అతడు.. ఇప్పటికే 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్', 'బ్రో' వంటి చిత్రాలతో మెప్పించాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు చాలా మూవీలు చేస్తున్నాడు.

పవన్ కల్యాణ్ ఇప్పుడు నటిస్తోన్న చిత్రాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి. టాలీవుడ్‌ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ క్రేజీ మూవీని మొగల్ చక్రవర్తుల కాలం నాటి కథతో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు.

Harihara Veeramallu Movie Glimpse Release On March 8th

పిరియాడిక్ జోనర్‌లో రాబోతున్న 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైంది. కానీ, అనివార్య కారణాల వల్ల షూటింగ్‌కు చాలా ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించిన టాకీ పార్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కానీ, ఎన్నికల కారణంగా ఈ సినిమాను సుదీర్ఘ కాలం పాటు పోస్ట్‌పోన్ చేశారు.

'హరిహర వీరమల్లు' మూవీకి సంబంధించిన షూటింగ్ ఆగిపోవడంతో ఈ సినిమాను కూడా ఆపేశారని ఇటీవలే ఓ న్యూస్ ప్రచారం అయింది. ఈ పరిస్థితుల్లో త్వరలోనే గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసి, ఆ పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ గ్లింప్స్ డేట్ గురించి ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' మూవీ కొత్త గ్లింప్స్ వీడియోను మహా శివరాత్రిని పురస్కరించుకుని మార్చి 8వ తేదీన విడుదల చేస్తున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతుందని తెలిసింది. అదే కన్ఫార్మ్ అయితే మాత్రం పవన్ కల్యాణ్ అభిమానులకు ఒకేరోజు రెండు పండుగలు వస్తాయనడంతో ఏమాత్రం సందేహం లేదు.

Harihara Veeramallu Movie Glimpse Release On March 8th

ఇదిలా ఉండగా.. 'హరిహర వీరమల్లు' సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది. ఇందులో నిధి అగర్వాల్ కీలక పాత్రను చేస్తోంది. బాబీ డియోల్ ఇందులో విలన్‌గా చేస్తున్నాడు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X