పవన్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. హరిహర వీరమల్లు టీజర్ డేట్ వచ్చేసింది
టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. బడా సపోర్టుతోనే సినిమాల్లోకి వచ్చినా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన అతడు.. ఈ మధ్య కాలంలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతోన్నాడు. ఇలా 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్', 'బ్రో' వంటి చిత్రాలతో మెప్పించాడు. ఇప్పుడు కూడా చాలా చిత్రాల్లో నటిస్తున్నాడు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం నటిస్తోన్న సినిమాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ హై రేంజ్ మూవీని మొగల్ చక్రవర్తుల కాలం నాటి కథతో భారీ బడ్జెట్‌తో తీస్తున్నారు. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

మొగల్ చక్రవర్తుల కథతో రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' సినిమా షూట్ చాలా రోజుల క్రితమే మొదలైంది. కానీ, అనివార్య కారణాల వల్ల షూటింగ్‌కు చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల్లో దీనికి సంబంధించిన టాకీ పార్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ చూస్తోంది. కానీ, ఎన్నికల కారణంగా ఈ సినిమాను చాలా రోజుల పాటు ఆపేయాల్సి వచ్చింది.
క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'హరిహర వీరమల్లు' మూవీకి సంబంధించిన షూట్‌కు బ్రేకులు పడడంతో ఈ సినిమాను కూడా ఆపేశారని ప్రచారం అయింది. ఈ పరిస్థితుల్లో త్వరలోనే టీజర్‌ను రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేసింది. అందుకు తగ్గట్లుగానే తాజాగా ఈ మూవీ టీజర్ డేట్‌ను ప్రకటించింది.

హై రేంజ్ యాక్షన్‌తో తెరకెక్కుతోన్న 'హరిహర వీరమల్లు' మూవీ కొత్త టీజర్‌ను మే 2వ తేదీన ఉదయం 9 గంటలకు విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా వచ్చింది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. దీనిపై 'ధర్మం కోసం యుద్దం' అనే క్యాప్షన్‌ను కూడా పెట్టింది. ఈ బ్యాగ్రౌండ్ చూస్తుంటే ఏదో యుద్ధం తాలూకు విజువల్ మాదిరిగా కనిపిస్తోంది. మొత్తానికి పవన్ ఫ్యాన్స్ దీనిపై ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇదిలా ఉండగా.. 'హరిహర వీరమల్లు' సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది. ఇందులో నిధి అగర్వాల్ కీలక పాత్రను చేస్తోంది. బాబీ డియోల్ ఇందులో విలన్‌గా చేస్తున్నాడు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











