హరిహర వీరమల్లుపై ఫేక్ రివ్యూ.. నా అన్వేషణపై బాలయ్య అభిమానుల ట్రోలింగ్

సోషల్ మీడియా రాకతో ఏది అబద్ధమో, ఏది నిజమో తెలియని పరిస్ధితులు నెలకొన్నాయి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు విచ్చలవిడిగా పెరిగిపోవడంతో వ్యూస్ కోసం నకిలీ వార్తలను వైరల్ చేస్తున్నారు. కరెంట్ అఫైర్స్, సినిమా రివ్యూలు ఇలా దేనిని వదలకుండా వీడియోలు చేస్తూ జనాన్ని గందరగోళానికి గురిచేస్తున్నారు. వీరి మాటలు నమ్మి కొందరు ప్రేక్షకులు సినిమా చూడటం కూడా ఆపేస్తున్నారు. తాజాగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాపైనా అనేక ఫేక్ రివ్యూలు చక్కర్లు కొట్టాయి. వాటిలో ప్రపంచ యాత్రికుడు అన్వేష్ చేసిన రివ్యూ హాట్ టాపిక్‌గా మారింది.

ప్రపంచ యాత్రికుడిగా ఫేమస్
ఏపీలోని విశాఖపట్నానికి చెందిన అన్వేష్.. నా అన్వేషణ పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించారు. ప్రపంచంలోని పలు దేశాలలో చక్కర్లు కొడుతూ అక్కడి సంస్కృతి సాంప్రదాయాలు, ఆహారం, జీవన విధానాలు, వింతలు, విడ్డూరాలను పంచుకుంటున్నాడు. అతని సోషల్ మీడియాలో ఖాతాలకు మిలియిన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఏ దేశానికి వెళ్లినా ఆ దేశంతో ఇండియాను పోల్చుతూ అన్వేష్ చెప్పిన విధానం నచ్చడంతో జనం కూడా బాగానే ఆదరించేవారు.

HariHara VeeraMallu Netizens trolls Naa Anveshana Anvesh for Spreading fake news on Nandamuri Balakrishna

బెట్టింగ్ యాప్స్‌పై అన్వేష్ రచ్చ
ఇటీవలి కాలంలో తన పంథాను మార్చేశాడు అన్వేష్. ప్రపంచ వింతలతో పాటు కరెంట్ అఫైర్స్‌పై ఫోకస్ పెట్టి ప్రతి అంశంపై వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ కుంభకోణంపై వరుస వీడియోలు చేశాడు. దాంతో అన్వేష్‌కు ఫాలోవర్స్‌తో పాటు ఆదాయం కూడా బాగా పెరిగింది. ఈ మొత్తాన్ని బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయిన బాధితులకు అందజేస్తానని అనౌన్స్ చేశాడు. చాలా మంది ప్రపంచ యాత్రికులు, యూట్యూబర్లు సినిమాలు రిలీజ్ అయ్యాక రివ్యూలు చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. అన్వేష్ కూడా సినిమాలపై రివ్యూలు చెప్పడం ఆయా హీరోల అభిమానులు అతనిని ట్రోలింగ్ చేయడం జరుగుతూనే వస్తోంది.

వీరమల్లులో బాలయ్య ఉన్నాడంటూ రివ్యూ
ఈ క్రమంలో హరిహర వీరమల్లుపై నా అన్వేషణ చేసిన రివ్యూ వీడియో కలకలం రేపింది. తాను ఇప్పుడే సినిమా చూశానని, శ్రీకృష్ణదేవరాయలు తాతే మన హరిహర వీరమల్లు అని.. కోహినూర్‌ను ఎత్తుకుపోయిన ఔరంగజేబును ఎదిరిస్తాడని రివ్యూ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ నటన నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఉందని చెప్పాడు. అంతటితో ఆగకుండా ఇందులో ఓ సర్‌ప్రైజ్ ఉందని, ఇందులో మన బాలయ్య బాబు కూడా ఉన్నారని ... వీరమల్లు మనవడిగా శ్రీకృష్ణదేవరాయల పాత్రలో ఆయన ఎంట్రీ ఇచ్చారని ఆ సీన్ గూస్‌బంప్స్ అన్నట్లుగా ఉందని చెప్పాడు.

అన్వేష్‌పై బాలయ్య అభిమానుల ట్రోలింగ్
దీంతో ఈ రివ్యూ క్షణాల్లో వైరల్‌గా మారింది. పవన్, బాలయ్య ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే థియేటర్లు తగలబడిపోవడమేనంటూ కామెంట్స్ వచ్చాయి. కట్ చేస్తే సినిమా రిలీజ్ అయ్యాక హరిహర వీరమల్లుపై అన్వేష్ చెప్పింది ఫేక్ రివ్యూ అని తేల్చారు అభిమానులు. సినిమా కథ ఒకటైతే, అతను మరో స్టోరీ చెప్పాడని మండిపడుతున్నారు. అన్నింటికి మించి బాలయ్య బాబు ఎక్కడా లేకపోవడంతో అన్వేష్‌పై ట్రోలింగ్‌కు దిగుతున్నారు పవన్, బాలయ్య అభిమానులు. మరి దీనికి అన్వేష్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X