పవన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్: వచ్చే మూడు నెలలూ దాని మీదే ఫోకస్

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత జెట్ స్పీడుతో దూసుకుపోతున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆయన కమ్‌బ్యాక్ మూవీ 'వకీల్ సాబ్'కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. అయితే, అప్పటి టికెట్ రేట్ల ఇష్యూ కారణంగా టార్గెట్ మాత్రం రీచ్ కాలేదు. కానీ, ఆదరణను బాగా దక్కించుకుంది. దీంతో పవర్ స్టార్ రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇందులో భాగంగానే ఒకటి పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇలా ఇప్పటికే ఈ మెగా హీరో ఎన్నో చిత్రాలను కూడా మొదలు పెట్టేసిన విషయం తెలిసిందే.

కొద్ది రోజుల క్రితమే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో దగ్గుబాటి రాణా కీలక పాత్రను పోషించాడు. సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేశాడు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షఖుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ఆరంభంలో మంచి కలెక్షన్లు వచ్చాయి. కానీ, రెండో వారం నుంచి వసూళ్లు భారీగా డౌన్ అయ్యాయి. ఫలితంగా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోలేదు. కానీ, మొత్తంగా ఈ చిత్రం 97 కోట్ల రూపాయలకు పైగా షేర్‌ను రాబట్టి సత్తా చాటింది.

ఇప్పటికే పవన్ కల్యాణ్ మొదలు పెట్టిన సినిమాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను ఏఎమ్ రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మొగల్ కాలం నాటి కథతో రాబోతున్న ఈ సినిమాలో ఈ స్టార్ హీరో వజ్రాల దొంగగా నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. అయితే, దీన్ని మధ్యలోనే ఆపేసిన పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' మూవీని పూర్తి చేసుకున్నాడు. ఇక, ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రారంభిస్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ, ఇది అంతకంతకూ ఆలస్యం అవుతూనే ఉంది.

https://telugu.filmibeat.com/heroine/shruti-haasan-sizzling-photos-shakes-internet-108405.html

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'హరిహర వీరమల్లు' మూవీ షూటింగ్ గురించి తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ మూవీకి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను ఏప్రిల్ 6వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారట. ఇప్పటికే దీనికోసం ఏర్పాట్లను కూడా చేసుకున్నారని అంటున్నారు. అంతేకాదు, దిగ్గజ కళా దర్శకుడు తోట తరణి ఆధ్వర్యంలో చారిత్రక కట్టడాలకు సంబంధించిన సెట్‌లను కూడా ఏర్పాటు చేస్తున్ారు. ఇక, ఏప్రిల్ నుంచి ఈ మూవీ షూట్‌ను పున: ప్రారంభించి ఏకధాటిగా దాదాపు మూడు నెలల పాటు కొనసాగించి టాకీ పార్టును పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. అంటే ఇది పూర్తయ్యే వరకూ పవన్ కల్యాణ్ దీనిపైనే ఫోకస్ చేస్తాడని టాక్.

క్రేజీ కాంబోలో రాబోతున్న 'హరిహర వీరమల్లు' సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన 60 శాతం షూటింగ్ పూర్తైంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఈ మూవీకి భారీ స్థాయిలో రూ. 180 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X