మెగా ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్: ఏప్రిల్ నుంచి బరిలోకి దిగుతున్న పవన్ కల్యాణ్

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న బడా హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకోవడంతో పాటు స్టార్‌డమ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ వచ్చాడు. అయితే, ఆ మధ్య రాజకీయాల కోసం గ్యాప్ తీసుకుని.. 'వకీల్ సాబ్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు మళ్లీ వచ్చాడు. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో రెట్టించిన ఉత్సాహంతో ఎన్నో ప్రాజెక్టులను కూడా లైన్‌లో పెట్టుకున్నాడు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవలే 'భీమ్లా నాయక్' అనే సినిమాలో నటించాడు. దగ్గుబాటి రాణా ఇందులో కీలక పాత్రను పోషించాడు. సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేశాడు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం సమకూర్చాడు. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షఖుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ఆరంభంలో మంచి కలెక్షన్లు వచ్చాయి. కానీ, రెండో వారం నుంచి వసూళ్లు భారీగా డౌన్ అయ్యాయి. ఫలితంగా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకునేందుకు చాలా కష్టాలను చవి చూస్తోంది. ఇప్పటి వరకూ ఈ చిత్రం 95 కోట్ల రూపాయలకు పైగా షేర్‌ను రాబట్టింది.

Harihara Veeramallu Next Schedule From April

పవన్ కల్యాణ్ ఇప్పటికే మొదలు పెట్టిన ప్రాజెక్టుల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను ఏఎమ్ రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మొగల్ కాలం నాటి కథతో రాబోతున్న ఈ సినిమాలో పవర్ స్టార్ వజ్రాల దొంగగా నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. అయితే, దీన్ని మధ్యలోనే ఆపేసి పవన్ 'భీమ్లా నాయక్'ను పూర్తి చేసుకున్నాడు. ఇక, ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రారంభిస్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ, ఇది అంతకంతకూ ఆలస్యం అవుతూనే వస్తోంది.

'హరిహర వీరమల్లు' మూవీ షూటింగ్ గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ మూవీకి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను ఏప్రిల్ మొదటి వారం నుంచి ప్రారంభించబోతున్నారట. ఇప్పటికే దీనికోసం ఏర్పాట్లను కూడా చేసుకున్నారని అంటున్నారు. అంతేకాదు, చారిత్రక కట్టడాలకు సంబంధించిన సెట్‌లను కూడా ఏర్పాటు చేసి ఉంచారని తెలుస్తోంది. ఇక, ఏప్రిల్ నుంచి ఈ మూవీ షూట్‌ను పున: ప్రారంభించి ఏకధాటిగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. అంటే ఇది పూర్తయ్యే వరకూ పవన్ కల్యాణ్ మరో సినిమా షూట్‌లో పాల్గొనే అవకాశాలు లేవని తెలిసింది.

క్రేజీ కాంబోలో రాబోతున్న 'హరిహర వీరమల్లు' సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది. దీనికోసం పవన్ కల్యాణ్ గుర్రపు స్వారీ, కత్తిసాము, కర్రసాము సహా ఎన్నో విద్యలను నేర్చుకున్నాడు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఈ మూవీకి భారీ స్థాయిలో రూ. 180 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారని ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X