HariHara VeeraMallu: వీరమల్లు కోసం పవన్ యాక్షన్ కొరియోగ్రఫి.. ఆ 18 నిమిషాలు పూనకాలే!

దాదాపు ఐదేళ్లపాటు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని జూలై 24న ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది హరిహర వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటించారు. మూడేళ్ల తర్వాత పవన్ నటించిన సినిమా కావడంతో అభిమానులు ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రిలీజ్‌కు రెండ్రోజులే ఉండటంతో చిత్ర యూనిట్ జూలై 21న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన పవన్ కళ్యాణ్.. వీరమల్లు సినిమాలోని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

హరిహర వీరమల్లు చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.250 కోట్లకు పైగా బడ్జెట్‌తో స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం నిర్మించారు. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఇందులో ఔరంగజేబు పాత్ర పోషిస్తున్నారు. నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రీ, సత్యరాజ్, జిషుసేన్ గుప్తా, పూజిత పొన్నాడ, సచిన్ ఖేడేకర్, అనుపమ్ ఖేర్ తదితరులు నటించారు. ఇటీవల మరణించిన నట దిగ్గజం కోట శ్రీనివాసరావుకు ఇదే సినిమా కావడం గమనార్హం. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించగా.. వీఎస్ జ్ఞాన శంకర్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.

HariHara VeeraMallu Pawan Kalyan Designed 18 minutes Fight Sequence for Climax

బహుముఖ ప్రజ్ఞశాలి పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్‌లో నటుడు మాత్రమే కాదు.. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. సింగర్‌, కొరియోగ్రాఫర్, డైరెక్టర్, స్క్రీన్ రైటర్, నిర్మాత, నేరెటర్‌తో పవన్‌లో యాక్షన్ కొరియోగ్రాఫర్ కూడా ఉన్నారు. సినిమాల్లోకి రావడానికి ముందు ఎంతో ఇష్టపడి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ఆయన కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించడంతో పాటు మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం ఉంది. షిహాన్ హుస్సేనీ మాస్టర్ దగ్గర ఈ విద్యలు నేర్చుకున్నారు. మొదట్లో ఆయనకు నో చెప్పినప్పటికీ పవన్ కళ్యాణ్‌లోని పట్టుదల చూసి మార్షల్ ఆర్ట్స్ నేర్పించారు హుస్సేనీ. పలు సినిమాల్లో తన మార్షల్ ఆర్ట్స్‌ను పవన్ కళ్యాణ్ చూపించారు. అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి, తమ్ముడు, జానీ చిత్రాల్లో పవన్ విన్యాసాలు యువతకు పిచ్చెక్కించాయి.

యాక్టరే కాదు.. యాక్షన్ కొరియోగ్రాఫర్ కూడా
తమ్ముడు, బద్రీ, ఖుషి, డాడీ, గుడుంబా శంకర్, సర్దార్ గబ్బర్ సింగ్, అజ్ఞాతవాసి చిత్రాలకు పవన్ కళ్యాణ్ స్వయంగా యాక్షన్ కొరియోగ్రఫి అందించారు. ఈ చిత్రాల్లో యాక్షన్ సీక్వెన్స్‌లు పవన్ కళ్యాణ్ ప్రతిభకు అద్దం పడతాయి. తాజాగా విడుదల అవుతున్న హరిహర వీరమల్లులోనూ కర్రసాము, ఇతర మార్షల్ ఆర్ట్స్‌ను చూపించారు పవన్ కళ్యాణ్. సినిమా ప్రారంభమైన కొత్తలోనే ఆయన కుస్తి పడుతున్న వీడియోలు, ఫోటోలు ఇంటర్నెట్‌ను ఊపేశాయి. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ సినిమాలోని యాక్షన్ కొరియోగ్రఫి గురించి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆ 18 నిమిషాలు హైలైట్‌గా
హరిహర వీరమల్లు కోసం ఎంతో నలిగిపోయామని, ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో? ఎన్ని రికార్డులు బద్ధలు కొడుతుందో చెప్పలేనని అన్నారు. ఈ చిత్రం కోసం చాలా ఎఫర్ట్ పెట్టానని.. మీ కోసం కాలు కదిలించి డ్యాన్స్‌లు కూడా చేశానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఫైట్స్ చేసి చాలా కాలం కావడంతో ఎంతో కష్టపడి ఫైట్స్ చేశానని.. 18 నిమిషాల పాటు సాగే క్లైమాక్స్ సీన్‌కు తానే యాక్షన్ కొరియోగ్రఫీ చేశానని చెప్పి అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. నాడు ఔరంగజేబు అరాచకాలతో నలిగిపోయిన ప్రతి భారతీయుడు ఎదురు తిరిగితే ఎలా ఉంటుందనేది ఈ సీన్‌లో రిఫ్లెక్స్ అవుతుందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆ 18 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X