Pawan Kalyan: మరోసారి హరిహర వీరమల్లు వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!

గతంలో కంటే సినిమాల్లోకి కమ్‌బ్యాక్ అయినప్పటి నుంచి వరుసగా సినిమాల మీద సినిమాలను లైన్‌లో పెట్టుకుంటూ ఆశ్చర్యపరుస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పటికే 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' వంటి చిత్రాలతో ప్రేక్షకులను, ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించిన ఈ మెగా హీరో.. ఇప్పుడు మూడు, నాలుగు ప్రాజెక్టులను ప్రకటించేశాడు. పవర్ స్టార్ ప్రస్తుతం చేస్తోన్న సినిమాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి. టాలీవుడ్‌ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ క్రేజీ మూవీని మొగల్ చక్రవర్తుల కాలం నాటి కథతో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. కానీ, అనివార్య కారణాల వల్ల షూటింగ్‌కు చాలా ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించిన టాకీ పార్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే కొత్త షెడ్యూళ్లను ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అలాగే, పవన్ కల్యాణ్ కూడా సరికొత్త ప్రణాళికలతో ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా రిలీజ్ గురించి ఓ న్యూస్ ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది.

Harihara Veeramallu Postponed to October 24th 2023

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో రాబోతున్న 'హరిహర వీరమల్లు' మూవీకి ఈ ఏడాది వేసవిలో విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, అనివార్య కారణాల వల్ల అనుకున్న సమయానికి ఇది వచ్చే అవకాశాలు లేవని తాజాగా తెలిసింది. అంతేకాదు, ఈ చిత్రాన్ని సమ్మర్‌లో కాకుండా వచ్చే దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 24న విడుదల చేయడాని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని తెలిసింది. ఇది పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు షాకిచ్చే న్యూసే అని చెప్పాలి.

ఇక.. పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది. ఇందులో నిధి అగర్వాల్ కీలక పాత్రను చేస్తోంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X