హరిహర వీరమల్లు టీజర్ డేట్ ఫిక్స్: ఆ స్పెషల్ డేన పవన్ కల్యాణ్ ట్రీట్
రీఎంట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతూ ప్రేక్షకులకు, ఫ్యాన్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను పంచుతోన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పటికే 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' వంటి చిత్రాలతో అలరించిన ఈ స్టార్ హీరో.. ఇప్పుడు మూడు, నాలుగు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. అలా ఇప్పుడు పవర్ స్టార్ చేస్తోన్న సినిమాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ మూవీని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ మూవీ మొగల్ చక్రవర్తుల కాలం నాటి కథతో రూపొందుతోంది.
చారిత్రక నేపథ్యంతో రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది. కానీ, అనివార్య కారణాల వల్ల షూటింగ్‌కు చాలా బ్రేకులు పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో టాకీ పార్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్స్ చేసుకుంటోంది. అందుకు అనుగుణంగానే షెడ్యూళ్లను ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక, ఈ మూవీ కోసం పవన్ కల్యాణ్ కూడా సరికొత్త ప్రణాళికలతో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టీజర్ డేట్ గురించి ఓ న్యూస్ ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది.

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' మూవీ కొత్త గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, అలా జరగలేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. దీన్ని రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26వ తేదీన రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ప్రకటన సంక్రాంతికి వస్తుందని కూడా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇదిలా ఉండగా.. పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది. ఇందులో నిధి అగర్వాల్ కీలక పాత్రను చేస్తోంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. దీన్ని వచ్చే వేసవిలో విడుదల చేస్తారు.


Click it and Unblock the Notifications











