Harihara Veeramallu Trailer Review: హరిహర వీరమల్లు ట్రైలర్ రివ్యూ.. పులిని వేటాడే బెబ్బులి..

తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని హీరోగా వెలుగొందుతున్న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించడంతో సినిమాలకు దూరమయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన వ్యూహాలతో కూటమి అభ్యర్ధులు విజయం సాధించడంతో కీలకపాత్ర పోషించారు. చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో పాలన, రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు పవన్. ఇది అభిమానులకు సంతోషానిచ్చినా.. ఆయను తెరపై చూడలేమని బాధపడ్డారు. ఈ క్రమంలో తను కమిటైన సినిమాలను ఒక్కొక్కోటిగా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. దీనిలో భాగంగా హరిహర వీరమల్లు షూటింగ్‌ను ఎంతో కష్టపడి పూర్తి చేశారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది.. ట్రైలర్ ఎలా ఉంది? పవన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అభిమానులను అలరించిందా? లేదా అన్నది చూస్తే.

హరిహర వీరమల్లు చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా అనసూయ భరద్వాజ్ ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిశారు. బాబీ డియోల్, ఫర్గీస్ నక్రీ, నోరా ఫతేహి, సత్యరాజ్. విక్రమ్‌జిత్, జిషుసేన్ గుప్తా, సచిన్ ఖేడేకర్ తదితరులు కీలపాత్రలు పోషిస్తున్నారు. అకాడమీ అవార్డ్ విజేత ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహించగా.. జ్ఞాన శేఖర్ వీఎస్, మనోజ్ పరమహంసలు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి తొలుత ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించగా.. టేకప్ చేయగా అనివార్య కారణాలతో ఆయన తప్పుకుని జ్యోతికృష్ణ సీన్‌లోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ లాంటి సూపర్‌స్టార్‌తో, అందులోనూ టైట్ షెడ్యూల్ మధ్య జ్యోతికృష్ణ సమన్వయం చేసుకుని సినిమాను పూర్తి చేశారు.

HariHara VeeraMallu Trailer Review in Telugu Pawan Kalyan s high voltage performance

రాజకీయాలు, పాలనా వ్యవహారాలతో క్షణం తీరిక లేనప్పటికీ వీలున్నప్పుడల్లా షూటింగ్‌లో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం. కేవలం నాలుగు గంటల పాటు ఏకధాటిగా డబ్బింగ్‌ చెప్పి శెభాష్ అనిపించుకున్నారు. తొలుత ఈ సినిమాను జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు ఏఎం రత్నం. తిరుపతిలో జూన్ 8న భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని కూడా ప్లాన్ చేశారు. కానీ అనివార్య కారణాలతో హరిహర వీరమల్లు సినిమా వాయిదా పడింది. అన్ని పెండింగ్ పనులు పూర్తి చేసి జూలై 24న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు మెగా సూర్య ప్రొడక్షన్స్ ప్రకటించింది. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా చిత్ర యూనిట్ జూలై 3వ తేదీ ఉదయం 11.10 గంటలకు హరిహర వీరమల్లు ట్రైలర్‌ను విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఎంపిక చేసిన థియేటర్‌లలో ఈ సినిమా ట్రైలర్‌ స్పెషల్ స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేశారు. దీనికి పవన్ అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది.

హరిహర వీరమల్లు ట్రైలర్ ఎలా ఉందంటే:

2.57 నిమిషాల నిడివితో హరిహర వీరమల్లు ట్రైలర్‌ను విడుదల చేశారు. 'హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం.. ఈ దేశ శ్రమ బాద్ షా పాదాల కింద నలిగిపోతున్న సమయం. ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సయయం' అనే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. గోల్కొండ నుంచి 8వ వాడు బయల్దేరాడట వాడు ప్రాణాలతో ఢిల్లీకి చేరుకోకూడదని ఓ సైన్యాధిపతికి లేఖ వస్తుంది. ఇది నేను రాసిన చరిత్ర.. సింహసనమా? మరణ శాసనమా? అంటూ ఔరంగజేబు పాత్రలో బాబీడియోల్ క్రూరత్వాన్ని చూపించారు.

ఈ భూమ్మీద ఉన్నది ఒక్కటే కోహినూర్. దానిని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలని తనికెళ్ల భరణి చెబుతుండగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తారు. ఇప్పటిదాకా మేకల్ని తినే పులిని చూసుంటారు.. ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బూలిని చూస్తారని పవన్ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్ అదిరిపోతుంది. సర్దుకోలేకపోతున్నాను.. సాయం చేస్తావా? అని హీరోయిన్ నిధి అగర్వాల్ అడగ్గా వీరమల్లు మాటిస్తాడు. నేను రావాలని చాలామంది ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు.. కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారని.. వినాలి, వీరమల్లు చెప్పింది వినాలి అనే పవన్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

మొత్తంగా మూడు నిమిషాల ట్రైలర్‌లో ఢిల్లీ సుల్తానుల నుంచి సనాతన ధర్మాన్ని రక్షించడానికి వచ్చిన యోధుడిగా వీరమల్లుగా పవన్ కళ్యాణ్ తన పవర్ ప్యాక్డ్ యాక్టింగ్‌ను చూపించారు. కోహినూర్ వజ్రం కోసం ప్రధానంగా యుద్ధం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాల్లో పవన్ అద్భుతంగా నటించినట్లుగా కనిపిస్తోంది. చివరిలో ఆంధి వచ్చేసింది అంటూ బాబీ డియోల్ చెప్పే డైలాగ్ .. పవన్ కళ్యాణ్‌ను ప్రధాని నరేంద్రమోడీ మెచ్చుకున్న తీరును గుర్తుచేస్తుంది. పవన్‌కు జోడీగా నిధి బాగా సెట్ అయ్యారు. జ్ఞాన శేఖర్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫి, కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంచనాలను పెంచేసింది. మొత్తంగా హరిహర వీరమల్లు ట్రైలర్‌ .. ఈ సినిమాకు ప్లస్‌గా మారుతుంది అనడంలో సందేహం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X