ఎన్టీఆర్‌కు కేసీఆర్ పరామర్శ.. చంద్రబాబుతో మాట్లాడుతూ..
సినీ నటుడు, మాజీ మంత్రి, ఎంపీ హరికృష్ణ మృతికి సీఎం కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మెహదీపట్నంలోని హరికృష్ణ నివాసానికి వెళ్లి ఆయన భౌతిక దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. అనంతరం ఎన్టీఆర్, కల్యాణ్ రాంను పరామర్శించారు.
తండ్రి మరణంతో తీవ్ర విషాదంలో కూరుకుపోయిన ఎన్టీఆర్, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు.

ఈ సందర్బంగా తనకు ఎదురుపడిన ఏపీ సీఎం చంద్రబాబును పలకరించారు. కాసేపు ఆగి వారిద్దరూ మాట్లాడుకొన్నారు. కేసీఆర్ వెంట ఎంపీ సంతోష్, మంత్రి శ్రీనివాస యాదవ్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఉన్నారు. చంద్రబాబు వెంట టీడీపీ తెలంగాణ నేత రమణ తదితరులు ఉన్నారు.
మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు సభ్యుడు నందమూరి హరికృష్ణకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషికి చెప్పారు.


Click it and Unblock the Notifications











