ప్రస్తుతం వాటితోనే ఎంజాయ్ చేస్తున్నా.. ఇప్పట్లో పెళ్లి చేసుకోను: క్లారిటీ ఇచ్చిన హరిప్రియ
'తకిట తకిట', 'పిల్ల జమిందార్', 'జైసింహా' తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పరిచయం అయింది కన్నడ భామ హరిప్రియ. ఈమె చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువ గుర్తింపును తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండడంతో పాటు తరచూ ఈమెపై ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ కారణంగానే హరిప్రియ ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటోంది. ఈ మధ్య ఆమెపై ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి. దీంతో హరిప్రియ తొలిసారి తనపై వస్తున్న వార్తలపై స్పందించింది.
ఇటీవల ఓ కన్నడ ఛానెల్‌లో హరిప్రియ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వచ్చాయి. దీనిపై ప్రత్యేకంగా ఓ బులిటెన్ ప్రసారం చేసింది సదరు ఛానెల్. ఇది చూసిన హరిప్రియ దానికి సంబంధించిన క్లిప్‌ను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

అంతేకాదు, 'నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. ప్రస్తుతానికి విలక్షణమైన పాత్రలతోనే నేను ఎంజాయ్ చేస్తున్నాను. మరీ ముఖ్యంగా పెళ్లి చేసుకోవాలంటే పార్ట్‌నర్ కావాలి. అలాంటి వ్యక్తిని నేను చూసుకోలేదు. ప్రస్తుతం నా దృష్టి మొత్తం సినిమాలపైనే ఉంది. కాబోయేవాడిని వెతకడానికి ఇదే సరైన సమయం అనుకుంటా' అని ఆమె ట్వీట్ చేసింది.
ఇప్పుడు మాత్రమే కాదు.. గతంలోనూ ఈమెపై ఎన్నో వార్తలు వచ్చాయి. ఇప్పుడు పెళ్లి చేసుకుంటుందని అన్న వార్తలు మాత్రమే వచ్చాయి. అప్పుడైతే హరిప్రియ ఓ వ్యక్తితో ఎఫైర్ నడుపుతుందని, ఇద్దరూ కలిసి తరచూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని కొన్ని ఛానెళ్లు ప్రసారం చేశాయి. అలాగే, చాలా వెబ్‌సైట్లలో కూడా వార్తలు రాశారు. దీంతో హరిప్రియ ఓ రేంజ్‌లో ఫైర్ అయింది. అయినా.. ఆమెపై పుకార్లు షికార్లు చేయడం మాత్రం ఆగడం లేదు.


Click it and Unblock the Notifications











