Bhavadeeyudu Bhagat Singh ఫ్యాన్స్ కేక పెట్టించేలా పవన్ కల్యాణ్ స్వాగ్.. హరీష్ శంకర్ క్లారిటీ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో భవదీయుడు భగత్ సింగ్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లాల్సింది. అయితే పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బీజీగా ఉండటం కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. అయితే ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఎలా ఉండబోతున్నారనే విషయంపై క్లారిటీ ఇస్తూ..
పవన్ కల్యాణ్ నుంచి ప్రేక్షకులు, అభిమానులు ఏదైతే ఆశిస్తారో అన్నీ ఉంటాయి. పవన్ స్టైయిల్‌లో స్టెప్పులు, డైలాగ్స్, క్యారెక్టర్‌లో ఉండే స్వాగ్..మాస్, మసాలా అంశాలు ఉంటాయి అని హరీష్ శంకర్ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు.

ట్విట్టర్‌లో హరీష్ శంకర్‌ను ఓ అభిమాని.. భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో ఆ స్టెప్పులు, ఆ స్టయిల్, ఆ స్వాగ్ ఏమైపోయాయి కల్యాణ్ అన్నా.. హరీష్ శంకర్ గారు.. అన్న మళ్లీ నీ వల్లే అవుతుంది ఇలాంటివి. నీ సినిమాతో లాస్ట్ అనిపిస్తుంది అని అన్నాడు. అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. అన్నీ ఉంటాయి. ఏది మిస్ అవ్వదు. మీరు నన్ము నమ్మండి. మీరు వెయిట్ చేయడంలో ఫలితం తప్పకుండా ఉంటుంది అని హరీష్ శంకర్ అన్నారు.
పవన్ కల్యాణ్ సినిమాల విషయానికి వస్తే.. హరి హర వీరమల్లు చిత్రం షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ సినిమాను మార్చి 30 తేదీ, 2023లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే అ సినిమాతో పాటు సముద్రఖని దర్శకత్వంలో వినోదయ సీతమ్ సినిమా రీమేక్‌లో పవన్ కల్యాణ్ నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











