చరిత్ర మళ్లీ పుట్టింది.. చిరంజీవి అయ్యింది.. హాట్సాఫ్ రామ్ చరణ్: హరీష్ శంకర్

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్‌లో విడుదలైంది. సైరా విడుదల సందర్బంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పండుగ వాతావరణం కనిపించింది. గాంధీ పుట్టిన రోజున రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వీరత్వం చూసి ఫిదా అవుతోంది సినీ లోకం. మొదటి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ తనదైన స్టైల్ ట్వీట్ చేసి మెగా అభిమానుల్లో ఉన్న ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. ''చరిత్ర మళ్లీ పుట్టింది.. చిరంజీవి అయ్యింది.. హాట్సాఫ్ రామ్ చరణ్'' అంటూ మెగా అభిమానులకు పూనకం తెచ్చే సందేశం పోస్ట్ చేశారు హరీష్ శంకర్. డైరెక్టర్ సురేందర్ రెడ్డి అసాధారణమైన పని చేసి చూపించారని అన్నారు. హాట్సాఫ్ రామ్ చరణ్.. చిరు వేసిన బాణం గురి తప్పలేదని ఈ సందర్బంగా హరీష్ శంకర్ పేర్కొన్నారు.

Harish Shankar Comments On Chiranjeevis Sye Raa Narasimhaa Reddy

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమా విజయంతో రెండు తెలుగు రాష్ట్రాల మెగా అభిమానులతో పాటు సినీ లోకమంతా సంబరాల్లో మునిగి తేలుతోంది.

ఇక ఇటీవలే వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గద్దలకొండ గణేష్ రూపంలో భారీ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నారు హరీష్ శంకర్. కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ఈ సినిమా మెగా అభిమానులకు మాస్ మసాలా విందు ఇచ్చింది. చిత్రంలో గద్దలకొండ గణేష్ లేపిన గత్తర సైరా వరకు సాగింది. ఇక దాన్ని సైరా కంటిన్యూ చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X