Vijay Deverakonda అంత మాట అనేశాడు.. రౌడీ స్టార్‌పై హరీష్ శంకర్ కామెంట్స్

టాలీవుడ్ సెన్సషనల్ హీరో విజయ్ దేవరకొండ గురించి తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు డైరెక్టర్ హరీష్ శంకర్. గద్దలకొండ గణేష్ రూపంలో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న హరీష్ శంకర్ ఓ యూ ట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో విజయ్ దేవరకొండపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హరీష్. ఆ వివరాలేంటో చూద్దామా..

గద్దలకొండ గణేష్ విజయం.. జోష్‌లో ఉన్న హరీష్

గద్దలకొండ గణేష్ విజయం.. జోష్‌లో ఉన్న హరీష్

తాను దర్శకత్వం వహించిన తాజా సినిమా గద్దలకొండ గణేష్ తొలిరోజే సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో మంచి జోష్‌లో ఉన్నారు ఆ సినిమా డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ సందర్బంగా సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తూ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొని సినిమా విశేషాలు, తన అనుభవాలు తెలుపుతున్నారు.

కెరీర్, సినిమా విశేషాలు.. హీరోల ముచ్చట్లు

కెరీర్, సినిమా విశేషాలు.. హీరోల ముచ్చట్లు

తాజాగా ఇస్తున్న ఇంటర్వ్యూల్లో తన కెరీర్, సినిమా విశేషాలతో పాటు హీరోలకు సంబంధించిన ముచ్చట్లు కూడా పంచుకుంటున్నారు హరీష్. ఈ మేరకు తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో టాలీవుడ్ సెన్సషనల్ హీరో విజయ్ దేవరకొండతో తాను ఎదుర్కొన్న ఓ అనుభవాన్ని వివరించారు.

యూత్ ఐకాన్.. విజయ్ దేవరకొండ

యూత్ ఐకాన్.. విజయ్ దేవరకొండ

హీరో విజయ్ దేవరకొండ అంటే యూత్ ఐకాన్ అని చెప్పారు హరీష్ శంకర్. ఆయన నటించిన 'అర్జున్ రెడ్డి' సినిమా తర్వాత విజయ్‌కి కథ చెబుదాం ఒకసారి కలుద్దాం అని మెసేజ్ పెట్టానని.. అయితే విజయ్ మాత్రం నేను రెండేళ్ల వరకూ బిజీగా ఉన్నానని తనతో చెప్పేశాడని అన్నారు. ఇక విజయ్ దేవరకొండలో నెగెటివ్ అంటే.. తనపై వస్తున్న విమర్శలను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాడు. నాకు తెలిసి అతను అవేవీ మన పని మనం చూసుకుంటూ సరిపోద్ది అని హారీష్ అన్నారు.

వాల్మీకి కాదు గద్దలకొండ గణేష్

వాల్మీకి కాదు గద్దలకొండ గణేష్

ఇక హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన తాజా సినిమా 'గద్దలకొండ గణేష్' గురించి చెప్పుకుంటే.. ఈ సినిమాకు ముందుగా వాల్మీకి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ తోనే ప్రమోషన్స్ కూడా జరిగాయి. కానీ కొన్ని వివాదాల కారణంగా తీరా విడుదలకు ముందు రోజు ఆ సినిమా పేరును గద్దలకొండ గణేష్‌గా మార్చేశారు.

గద్దలకొండ గణేష్ మూవీ

గద్దలకొండ గణేష్ మూవీ

తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ'కి రీమేక్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది గద్దలకొండ గణేష్ మూవీ. హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా.. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రంలో వరుణ్ తేజ్ హీరోగా నటించగా, ఆయన సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 20న విడుదలైన ఈ సినిమా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X