పవన్ ఫ్యాన్స్‌కు మెగా గుడ్ న్యూస్: అదిరిపోయే పిక్ షేర్ చేసిన హరీష్

కొంత కాలంగా యమ జోష్‌తో కనిపిస్తూ వరుసగా సినిమాల మీద సినిమాలను చేసుకుంటూ వెళ్తోన్నాడు టాలీవుడ్ బడా హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. 'వకీల్ సాబ్' చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన అతడు.. అప్పటి నుంచి ఏమాత్రం తగ్గకుండా జెట్ స్పీడుతో దూసుకెళ్తోన్నాడు. ఇలా ఇప్పుడు చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. ఇలా ఇప్పుడు పవన్ నటిస్తోన్న సినిమాల్లో హరీష్ శంకర్ తెరకెక్కిస్తోన్న 'ఉస్తాద్ భగత్‌ సింగ్' ఒకటి. ఈ సినిమా ఎప్పుడో ప్రకటించినా.. షూటింగ్ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశగా ఉండిపోయారు.

వాస్తవానికి 'వకీల్ సాబ్' మూవీ చేస్తోన్నప్పుడే పవన్ కల్యాణ్ 'గబ్బర్ సింగ్' వంటి భారీ విజయాన్ని అందించిన హరీష్ శంకర్‌తోనూ 'భవదీయుడు భగత్ సింగ్' అనే సినిమా ప్రకటించాడు. కానీ, ఈ మూవీని మాత్రం అనుకున్న సమయానికి పట్టాలెక్కించలేదు.

Harish Shankar Completes Look Test for Pawan Kalyan Ustaad Bhagat Singh

దీంతో ఈ ప్రాజెక్టును పవన్ కల్యాణ్ ఆపేసినట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఈ సినిమాను 'ఉస్తాద్ భగత్ సింగ్' పేరుతో చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతేకాదు, ఆరోజే పూజా కార్యక్రమాలను కూడా జరిపేసి అనుమానాలకు పుల్‌స్టాప్ పెట్టేశారు. ఇక, తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది.

Harish Shankar Completes Look Test for Pawan Kalyan Ustaad Bhagat Singh

సక్సెస్‌ఫుల్ కాంబోలో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ షూటింగ్‌పై రోజుకో వార్త వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాకు సంబంధించిన లుక్ టెస్టును పూర్తి చేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

ఇందుకోసం ఓ ఫొటోను కూడా షేర్ చేశాడు. అంతేకాదు, తాజాగా ఈ స్టార్ డైరెక్టర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సెట్స్‌కు సంబంధించిన వర్క్ శరవేగంగా సాగుతున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కొన్ని ఫొటోలను వదిలింది. అలాగే, ఈ మూవీ షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతుందని కూడా వెల్లడించింది.

Harish Shankar Completes Look Test for Pawan Kalyan Ustaad Bhagat Singh

'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది 'తేరీ' మూవీకి రీమేక్‌గా రాబోతున్నట్లు ఇప్పటికే న్యూస్ లీకైంది. ఏప్రిల్ 5వ తేదీ నుంచి ఈ మూవీ షూట్ మొదలు కాబోతుందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X