Trivikram Vs Harish Shankar: త్రివిక్రమ్‌పై హరీష్ డైరెక్ట్ ఎటాక్.. మిస్టర్ బచ్చన్‌లో గురూజీని అవమానించాడా?
సినిమా పరిశ్రమలో హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణుల మధ్య ప్రొఫెషనల్‌గా ఇగో, జెలసీ ఉండటం సహజంగానే కనిపిస్తుంది. కాకపోతే ప్రొఫెషనల్ వ్యవహారకే పరిమితమవుతుంటాయి. వాటిని పబ్లిక్ చేయకుండా జాగ్రత్త పడుతుంటారు. అయితే తాజాగా అగ్ర దర్శకుల మధ్య ఇగో వ్యవహరం ఏకంగా తెరపైనే బహిర్గతమైంది. ఆ ఇద్దరు దర్శకుల ఎవరు? వారి మధ్య గొడవలు ఏమిటి అనే విషయాల్లోకి వెళితే..
తెలుగు సినిమా పరిశ్రమల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మ్యాటర్ ఉన్న రైటర్ హరీశ్ శంకర్ ఇద్దరు టాప్ డైరెక్టర్లే. ఇద్దరిలో కామన్ పాయింట్ ఏమిటంటే.. వారిద్దరూ పవన్ కల్యాణ్‌కు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన వాళ్లే. అలాంటి దర్శకుల మధ్య ఏదో గొడవ ఉందనే వ్యవహారం తాజాగా మిస్టర్ బచ్చన్ సినిమా ద్వారా కొంత పొగ పెట్టింది.

మిస్టర్ బచ్చన్ సినిమాలో కొన్ని సీన్లు చూస్తే.. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను డైరెక్ట్‌గా టార్గెట్ చేసినట్టు ఎలాంటి అనుమానాలు లేకుండా స్పష్టంగా అర్ధం అవుతుంది. సినిమాలోని యాక్టింగ్ గురు (ప్రభాస్ శ్రీను) లాంటి పాత్రకు గురూజీ అని పేరు పెట్టి తనలోని ఇగోను, జెలసీని బయట పెట్టుకొన్నాడా? అనే ఫీలింగ్‌ను కల్పించాడు. చాలా చోట్ల యాక్టర్ కావాలనుకొన్న ఓ ఔత్సాహికుడు (చమ్మక్ చంద్ర) పాత్ర ద్వారా తన సైటర్లను సంధించాడు.
ఇక ఓ దశలో త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను టార్గెట్ చేసే విధంగా డైలాగ్స్‌ను కూడా బ్లాస్ట్ చేశాడు. నేను మాటల మాంత్రికుడి కాను.. నేను మేటర్ ఉన్న రైటర్‌ను అనే చెప్పుకొనే ప్రయత్నం చేశాడు. ఇలా త్రివిక్రమ్‌ను ఎందుకు టార్గెట్ చేశారనే విషయం ఇండస్ట్రీలోను, సినీ వర్గాల్లోను ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది.

మిస్టర్ బచ్చన్ సినిమా ఇప్పటి వరకు అంతర్గతంగా ఉన్న వారి విభేదాలు బహిర్గతం అయ్యాయనే వాదన బయటకు వచ్చింది. అయితే పవన్ కల్యాణ్‌తో హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా విషయంలో త్రివిక్రమ్ జోక్యం చేసుకోవడం హరీష్‌కు ఇష్టం లేదు. అందుకే ఆయనను ఈ విధంగా టార్గెట్ చేశాడనే విషయం మీడియాలోను, సినీ వర్గాల్లోను అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
త్రివిక్రమ్, హరీష్ మధ్య వ్యవహారంపై ఆ ఇద్దరిలో ఎవరైనా స్పందిస్తే తప్పా.. అసలు క్లారిటీ బయటకు వచ్చే అవకాశం లేదంటున్నారు. అయితే ఈ వివాదంపై త్రివిక్రమ్ స్పందిస్తాడా? లేదా హరీష్ వివరణ ఇస్తారా? అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











