మారిందో లేదో గానీ బాగానే రాలింది..నెటిజన్‌కు డైరెక్టర్ పంచ్
మాస్ పల్స్ తెలిసిన అతి కొద్ది మంది దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకరు. గబ్బర్ సింగ్ ఓ రీమేక్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. తనదైన శైలిలో రాసే పంచ్ డైలాగ్స్, తెరకెక్కించే విధానాని సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చివరగా వచ్చిన గద్దలకొండ గణేష్ సూపర్ హిట్‌గా నిలిచింది.
నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా హరీష్ శంకర్ ఓ ట్వీట్ చేశాడు. 'సినిమా జీవితాన్ని పెద్దగా చూపిస్తుంది. టీవీ జీవితాన్ని చిన్నగా చూపిస్తుంది . జీవితాన్ని జీవితం లా చూపించేది రంగస్థలం ఒక్కటే . ఒక మహానుభావుడు.. కళా కారులందరికి, ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు , నాటకాల రాయుడు అని పిలింపించుకొనే రోజుల్లో..నేను' అంటూ తన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు హరీష్ శంకర్.

అప్పటికి ఇప్పటికే అదే హెయిర్ స్టైలా? అని నెటిజన్ అడిగిన ప్రశ్నకు అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. మారిందో లేదో గానీ బాగానే రాలింది.. అంటూ ఓ పంచ్ డైలాగ్ వేశాడు. హరీష్ శంకర్ మాటలు, పంచ్‌లు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హరీష్ ప్రస్తుతం.. పవన్ కళ్యాణ్ కోసం స్క్రిప్ట్‌ను రెడీ చేసే పనిలో ఉన్నాడు.


Click it and Unblock the Notifications











