తమిళ సూపర్ హిట్ రీమేక్.. ఆ స్టార్‌తో దర్శకుడు!
డీజే చిత్రం తరువాత హరీష్ శంకర్ మరో చిత్రాన్ని ప్రారంభించలేదు. మా మధ్యన హరీష్ శంకర్ ఓ మల్టీస్టారర్ చిత్రానికి ప్లాన్ చేశాడు. కానీ అనుకోని కారణాలవలన ఆ చిత్రం కుదర్లేదు. దిల్ రాజు నిర్మాణంలో ఆ చిత్రం తెరక్కుతుందని భావించారు. కానీ ఆ ప్రతిపాదన వెనక్కు పోయింది.
తాజగా మరో మారు దిల్ రాజు, హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా అంటూ వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు ఇటీవల తమిళ చిత్రం 96 రీమేక్ హక్కులని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 96 రీమేక్ కు హరీష్ శంకర్ దర్శత్వం వహించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

తమిళ చిత్రం 96లో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. తెలుగు వెర్షన్‌లో నాని, సమంత నటించే అవకాశం ఉంది. ఈ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే చిత్రం కోసం తెలుగులో నటీనటుల వేట కొనసాగుతోంది. దిల్ రాజు ప్రస్తుతం హలొ గురు ప్రేమ కోసమే, మహర్షి వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు. రామ్ నటించిన హలొ గురు ప్రేమకోసమే చిత్రం అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











