మళ్ళీ వార్తల్లోకి హరీష్ శంకర్ మల్టీస్టారర్.. హీరోలు ఎవరంటే!
మాస్ ఆడియన్స్ అభిరుచికి అనుగుణంగా సినిమాలు తెరకెక్కించే దర్శకుడు హరీష్ శంకర్ మళ్ళీ వార్తల్లో నిలిచాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేసిన దువ్వాడ జగన్నాథం చిత్రం తరువాత హరీష్ శంకర్ మరో చిత్రం ప్రారంభించలేదు. డీజే మూవీ తరువాత హరీష్ దాగుడుమూతలు మల్టీస్టారర్ చిత్రానికి ప్లాన్ చేశాడు. ఆ చిత్రం కోసం కొందరు హీరోలని సంప్రదించినా వర్కౌట్ కాలేదు.
తాజగా హరీష్ శంకర్ మరోమారు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. దాగుడుమూతలు చిత్రాన్ని తెరకెక్కించేందుకు హరీష్ శంకర్ హీరో సుధీర్ బాబు, మరో హీరో రామ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వీళ్ళిద్దరూ అంగీకారం తెలిపితే ఈ ప్రాజెక్ట్ ఓకే అయినట్లే.

ప్రస్తుతం సుధీర్ బాబు నను దోచుకుందువటే చిత్రంలో నటిస్తున్నాడు. రామ్ హలొ గురు ప్రేమ కోసమే చిత్రంతో బిజీగా ఉన్నాడు. మొదట ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాలనుకున్నా ఆ తరువాత ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని విశేషాలు త్వరలో తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











