వరుణ్‌ను ఆ గెటప్‌‌లో‌ చూడగానే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చింది: హరీష్ శంకర్

మెగాప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం 'గద్దలకొండగణేష్‌'. పూజా హెగ్డే ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రంలో తమిళ హీరో అధర్వ మురళి కీలక పాత్ర పోషించారు. సెప్టెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలయ్యి మొదటి షో నుండే పాజిటివ్‌ టాక్‌తో సూపర్‌హిట్‌ కలెక్షన్స్‌ సాధిస్తోంది. ఈ సందర్భంగా సెప్టెంబర్‌ 27న వైజాగ్‌లో గ్రాండ్‌ సక్సెస్‌ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో..

నటి డింపుల్ హయాతి మాట్లాడుతూ - "నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన హరీష్‌ శంకర్‌సర్‌కి థాంక్స్‌. అందరూ స్పెషల్‌సాంగ్‌ చాలా బాగుంది అని స్టేజి ఎక్కి మరి డాన్స్‌ వేస్తున్నారు. 4 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌లో నేను మళ్ళీ మళ్ళీ సినిమాలు చేయాలనుకుంటున్నాను" అన్నారు.

Harish Shankar emotional at Valmiki success meet

నటుడు బ్రహ్మాజీ మాట్లాడుతూ - " గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. ఈ సినిమాలో నా లైఫ్ లో గుర్తుండిపోయే క్యారెక్టర్ చేశాను. హరీష్ గారు అన్ని రూల్స్ బ్రేక్ చేసి కొత్తగా ఆర్టిస్టులను ఎంపిక చేశారు. వరుణ్ ఈ క్యారెక్టర్ లో జీవించేశారు" అన్నారు.

హీరోయిన్‌ మృణాళిని రవి మాట్లాడుతూ - '' నేను మొదటి సారి వైజాగ్ వచ్చాను. ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి వరుణ్, హరీష్, మా నిర్మాతలే కారణం. ఈ సినిమాలో పార్ట్‌ అయినందుకు హ్యాపీగా ఫీల్‌ అవుతున్నాను. బుజ్జమ్మ క్యారెక్టర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అవుతున్నారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్‌'' అన్నారు.

చిత్ర నిర్మాత గోపి ఆచంట మాట్లాడుతూ - ''విజయవాడలో సక్సెస్ టూర్ స్టార్ట్ చేశాం. ఈ రోజు వైజాగ్‌తో టూర్ ముగిస్తున్నాం. మీ అందరిని కలుసుకోవాలని ఈ మీట్ పెట్టడం జరిగింది. ఈ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు మెగా ఫ్యాన్స్ కి, పవర్ స్టార్ ఫ్యాన్స్ కి అలాగే ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు" అన్నారు.

పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ - ''ఇంకో ఆరు గంటల్లో సినిమా రిలీజ్‌ పెట్టుకొని టైటిల్‌ మార్చినా అందరూ హీరోల ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు. ఈ వేదిక మీదినుండి అందరి హీరోలకి, వారి ఫ్యాన్స్ కి మనస్ఫూర్తిగా థాంక్స్ చెపుతున్నాను. ఈ సినిమా నాకు చాలా చాలా స్పెషల్. నేను ఒక స్క్రిప్ట్ అనుకోని ఇద్దరు హీరోలతో ఒక సినిమా చేద్దాం అని బయలుదేరినప్పుడు ఒక థాట్ కి వరుణ్ సీడ్ వేశారు. ఆ థాట్ నా సినిమా మేకింగ్ స్టైల్ ని మార్చింది. ఫస్ట్ టైమ్ రెగ్యులర్ ఫార్మాట్ కాకుండా నేనో సినిమా తీశాను. నేను సినిమా చేస్తున్నంత సేపు నన్ను నమ్మి చేసినందుకు వరుణ్‌కు మరోసారి థాంక్స్. ఒక్కసారి 'గద్దల కొండ గణేష్' గెటప్‌లో వరుణ్ కెమెరా ముందుకు రాగానే నాకు చాలా ఎనర్జీ వచ్చింది. వరుణ్ తన డెడికేషన్, హార్డ్ వర్క్ తో సినిమాను ముందుకు తీసుకెళ్లాడు. నేను మనసులో ఏది అనుకుంటే అది స్క్రీన్ మీదకు రావడానికి మా ప్రొడ్యూసర్స్ రామ్ ఆచంట , గోపి ఆచంట నాకన్నా ఎక్కువ ఫ్యాషనేట్ గా పని చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X