ఆ హీరో పక్కన హీరోయిన్‌తో అంత ఎక్స్‌పోజింగ్ అవసరమా? హరీష్ శంకర్‌పై ఆగని ట్రోల్స్
తెలుగు సినిమా దగ్గర ఎప్పటికపుడు కొత్త హీరోయిన్స్ వస్తూనే ఉంటారు. వారిలో కొంతమంది ఏళ్ళు తరబడి పాతుకుపోతే మరికొందరు వచ్చిన కొన్నేళ్ల లోనే కనుమరుగైపోతారు. కాగా ఇలా గడిచిన కొన్నేళ్లలోనే చాలా మంది యంగ్ అండ్ హాట్ బ్యూటీస్ ఇండస్ట్రీలో పరిచయం అయ్యి సత్తా చాటారు. శ్రీలీల, కృతి శెట్టి లాంటి పిన్న వయసున్న యువ హీరోయిన్స్ ఏలుతున్న ఈ సమయంలో జస్ట్ రీసెంట్ గా టాలీవుడ్ యువతలో సెన్సేషన్ రేపిన మరో హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది అందాల భామ భాగ్యశ్రీ బోర్స్ అని చెప్పాలి.
కాగా బాలీవుడ్ కి చెందిన ఈ యంగ్ హీరోయిన్ తెలుగులో కూడా పాగా వేసేందుకు రవితేజ దర్శకుడు హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో "మిస్టర్ బచ్చన్" అనే సినిమాలో నటించి ఎంట్రీ ఇచ్చింది. అయితే సినిమా రిలీజ్ కి ముందు వరకు కూడా ఏదో స్టార్ హీరోయిన్ రేంజ్ ఫేమ్ ని తెచ్చుకొని కొన్ని రోజులు అలా ఆమెనే సినీ వర్గాల్లో సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ అయ్యింది. కాగా సీన్ కట్ చేస్తే సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది.

దీనితో భాగ్యశ్రీ మొదటి అడుగే తెలుగు సినిమాలో విఫలం కాగా ఇప్పుడు సినిమా ఓటిటిలో వచ్చాక మాత్రం మరి రకంగా కామెంట్స్ మొదలయ్యాయి. అప్పుడు థియేటర్స్ లో చూడని వారు సినిమాని నెట్ ఫ్లిక్స్ లో చూసి దర్శకుడు హరీష్ శంకర్ పై నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. కాగా అసలు సినిమాలో హరీష్ దృష్టి అంతా భాగ్యశ్రీ పైనే ఉన్నట్టు అనిపిస్తుంది అని సినిమాని ఆమె కోసమే తీసినట్టుగా చేసాడు అంటూ సోషల్ మీడియాలో కొందరు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు.
అలాగే భాగ్యశ్రీ అందాలు, నడుము లాంటి వాటిపై పెట్టిన శ్రద్ధ సినిమాని ఎలా హిట్ సినిమాగా చేయాలి అనే దానిపై కూడా దృష్టి పెట్టుంటే బాగుండేది అని పోస్ట్ ఓటిటి రిలీజ్ గట్టి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతే కాకుండా పలు క్రింజ్ సీన్స్ పై కూడా హరీష్ శంకర్ పై భారీగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా అప్పుడు సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యినపుడు కూడా భాగ్యశ్రీ విషయంలో హరీష్ శంకర్ ఓవర్ డ్రమాటిక్ గా చేసాడని, రవితేజ లాంటి హీరోతో ఆమెను అంత ఎక్స్‌పోజింగ్ చేయించడం అవసరమా? అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో అయితే అసలు ఆ సమయంలో ఏ ఆడపిల్ల ఇంత ఎక్స్ పోజింగ్ అది కూడా నార్మల్ సీన్స్ కూడా ఉండేది అంటూ కామెంట్స్ వచ్చాయి.
ఇలా భాగ్యశ్రీ విషయంలో మాత్రం హరీష్ శంకర్ పై అప్పుడు ఇప్పుడూ సార్లూ గట్టిగానే అక్షింతలు పడ్డాయని చెప్పక తప్పదు. కాగా ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తే భారీ నష్టాలే ఈ సినిమాకి మిగిలాయి. అలాగే రీసెంట్ గానే ఓటిటి లో వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు, తమిళ్ అలాగే కన్నడ, మలయాళ భాషల్లో మిస్టర్ బచ్చన్ ప్రస్తుతం అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications











