పవన్-హరీష్ మూవీపై పుకార్లు.. మీడియాపై డైరెక్టర్ ఫైర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులకు షాక్‌ల మీదు షాకులు ఇస్తున్నాడు. అసలు సినిమాలు చేస్తాడా? తమ హీరోను వెండితెరపై మళ్లీ చూస్తామా? అని నిరాశ పడ్డ ఫ్యాన్స్‌లో కొత్త జీవాన్ని నింపాడు పవర్ స్టార్. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు చిత్రాలను ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఒకదాని తరువాత మరొకటి చేస్తూ.. ఫుల్ బిజీగా మారబోతోన్నాడు.

 శరవేగంగా పింక్ రీమేక్..

శరవేగంగా పింక్ రీమేక్..

బాలీవుడ్ హిట్ చిత్రం పింక్‌ను తెలుగులో దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీకి పవన్ ఇచ్చిన డేట్స్ కొన్నేనని, అందుకే షూటింగ్‌ను జెట్ స్పీడ్‌లో కానిచ్చేస్తున్నారని టాక్. మొదటి రోజు నుంచే లీకుల పర్వం మొదలైంది. ఫస్ట్ డే షూటింగ్ లొకేషన్‌లోంచి పవన్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో లీకైంది.

కొబ్బరికాయ కొట్టిన క్రిష్..

కొబ్బరికాయ కొట్టిన క్రిష్..

మొఘలుల కాలం నాటి కథను ఆధారం చేసుకుని తెరకెక్కిస్తున్న పీరియాడిక్ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓ దొంగ పాత్రను పోషించబోతోన్నాడని టాక్. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూట్ కూడా ప్రారంభం కానుందని తెలుస్తోంది.

క్రేజీ ప్రాజెక్ట్..

పవన్ కళ్యాణ్‌తో గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాను తెరకెక్కించాడు హరీష్ శంకర్. దబాంగ్ సినిమాకు రీమేక్ అయినప్పటికీ ఆ చాయలు ఎక్కడా కనిపించకుండా మార్పులు చేర్పులు చేసి బ్లాక్ బస్టర్‌ అయ్యేలా మలిచాడు డైరెక్టర్. మళ్లీ పవన్ కళ్యాణ్‌తో ఆ డైరెక్టర్ అలాంటి ఓ సినిమా చేయాలని సగటు సినీ ప్రేక్షకుడు అనుకున్నాడు. మైత్రీ మూవీస్‌.. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి అందరి కోరికను తీర్చేసింది.

ఇదీ కూడా రీమేక్..

ఇదీ కూడా రీమేక్..

అయితే పవన్ కళ్యాణ్‌తో చేయబోయే ఈ నూతన చిత్రం కూడా ఓ రీమేక్ అని, అలా అయితే సేఫ్ అని హరీష్ శంకర్ భావిస్తున్నట్టు ఓ వెబ్‌సైట్ కథనాన్ని ప్రచురించింది. వీటిపై హరీష్ స్పందిస్తూ.. ఈ వార్తలు నిజమో కాదో తెలుసుకోవడానికి మీరు నాకు ఫోన్ చేసే అవకాశం ఉంది.. అయినా మీరు అలా చేయకుండా తప్పుడు వార్తలు రాస్తున్నారు.. దయచేసి ఎవర్నీ తప్పుదోవ పట్టించరని భావిస్తున్నా.. థ్యాంక్యూ అంటూ కాస్త ఘాటుగానే స్పందించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X