Harish Shanker: ఆ వెబ్ సైట్ పర్సనల్ ఎటాక్.. వెంట్రుక కూడా పీకలేరు.. హరీష్ శంకర్ ఫైర్

మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన తాజా సినిమా ఈగల్ గురించి అందరికీ తెలిసిందే. ఫిబ్రవరి 9వ తేదీన విడుదల అయిన ఈ సినిమా హిట్ దిశగా దూసుకెళ్తోంది. ఎవరూ ఊహించని స్థాయిలో బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా సక్సెస్ మీట్ ను ఈరోజు నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్ హరీషం శంకర్ ఓ మీడియా వెబ్ సైట్ పై గట్టిగా ఫైర్ అయ్యారు. ఎప్పుడూ లేనంతంగా మండిపడ్డారు. ఈ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో రాబోతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అయితే చాలా రోజుల క్రితమే ఈ సనిమా ప్రకటించగా... పవన్ కల్యాణ్ రాజకీయాలు చేయడంతో ఈ సినిమాకు బ్రేక్ పడింది.

Harish Shankar Fires on One Media Website Which is Creat Rumors on Him Check Details

అయితే అదే అదునుగా చేసుకున్న ఓ మీడియా సంస్థ డైరెక్టర్ గురించి చాలా తప్పుడు వార్తలు ప్రచురించింది. ముఖ్యంగా హరీష్ శంకర్ చేస్తున్న శినిమాకు నాలుగేళ్లు గ్యాప్ వస్తుండడంతో.. ప్రొడ్యూసర్ ఇంటికెళ్లి ఫుల్ గా తాగుతున్నాడని రాశారట. అయితే తాజాగా దీనిపై డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందించారు. నాలుగేళ్లు అవుతుంది... సినిమా లేట్ అవుతుందని చెప్పి నేను తెల్లార్లూ ప్రొడ్యూసర్ ఇంట్లో పడి తాగుతున్నట్లుగా వార్తలు రాశారని అన్నారు.

పవన్ కల్యాణ్ తో ఆయన ఓ పెద్ద సినిమా చేయబోతున్నారని అంటారని, అలాగే నేరుగా తన ఫొటో పెట్టకుండా.. షాడో ఫొటో పెడతారని వివరించారు. నిజంగా వాళ్లకు ఏమాత్రం దమ్ములేదని.. ఏమైనా దమ్ము ఉంటే తన ఫొటో పెట్టాలని డైరెక్టర్ చెప్పుకొచ్చారు. మీ సోర్స్ నిజం అయితే తాగానని తన ఫొటో పెట్టి, తన పేరు రాస్తే.. తాను కౌంటర్ ఇస్తానని అన్నారు. అంతేకాకుండా.. నేను తాగుతుంటే మీరేమైనా చూశారా, మీరెవరైనా వచ్చి నాకేమైనా పెగ్ కలిపారా, నాకు స్టఫ్ ఇచ్చారా అంటూ చాలా గట్టిగా ఫైర్ అయ్యారు డైరెక్టర్ హరీష్ శంకర్.

Harish Shankar Fires on One Media Website Which is Creat Rumors on Him Check Details

అన్ని వెబ్ సైట్లకు కాదు.. ఆ ఒక్క వెబ్ సైట్ కు మాత్రమే చెబుతున్నానంటూ హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. అలాగే ప్రొడ్యూసర్లను కాపాడుకోవాలని వారి వల్ల చాలా మందికి ఉపాధి దొరుకుతుందని అన్నారు. సేవ్ ది టైగర్స్ కాదు.. సేవ్ ది ప్రొడ్యూసర్స్ అని అన్నారు. అయినా నాలుగేళ్లు కాకపోతే ఐదేళ్లు ఆలస్యంగా వస్తుంది మీకేంటి అంటూ ప్రశ్నించారు. విపరీతంగా పర్సనల్ అటాక్ చేస్తున్నారని.. అది సరైన పద్ధతి కాదని చెప్పుకొచ్చారు.

అయినా ట్రోలింగ్స్ చూసే తాము ఈ స్థితికి చేరుకున్నామని.. మొదట సినిమాలు చేస్తామని ఇంట్లో చెప్పినప్పుడు త్లలిదండ్రుల నుంచే ట్రోలింగ్ స్టార్ అయిందని హరీష్ శంకర్ వివరించారు. ఆ తర్వాత బంధువులు, స్నేహితులు చాలా మంది ట్రోల్స్ చేశారని.. ఇప్పటికైనా మీరు ఇది ఆపితే బాగుంటుందని అన్నారు. లేదు మేము ఇలాగే చేస్తాం, ఇలాగే రాస్తామంటే ఏమైనా చేసుకోండి... నా వెంట్రుక కూడా పీకలేరంటూ వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X