పవన్‌తో సినిమాకు ముందే హరీశ్ మరో ప్రాజెక్టు: అల్లు అరవింద్ కోసమే అలా

తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో హరీశ్ శంకర్ ఒకడు. మాస్ మహారాజా రవితేజ నటించిన 'షాక్'తో దర్శకుడిగా పరిచయం అయిన అతడు.. ఆ తర్వాత 'మిరపకాయ్' అనే సినిమా చేసి మొదటి విజయాన్ని అందుకున్నాడు. దీని తర్వాత మధ్యలో కొన్ని పరాజయాలు వచ్చినా.. 'గబ్బర్ సింగ్', 'దువ్వాడ జగన్నాథమ్', 'గద్దలకొండ గణేష్' వంటి హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించాడు. తద్వారా స్టార్ డైరెక్టర్‌గా పేరొందాడు. ఇక, ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో హరీశ్ ఓ సినిమాను చేయబోతున్నాడు. ఇంతలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది.

'గబ్బర్ సింగ్' వంటి సూపర్ డూపర్ హిట్ మూవీ తర్వాత హరీశ్ శంకర్.. పవన్ కల్యాణ్‌తో మరో ప్రాజెక్టును లైన్‌లో పెట్టుకున్నాడు. ఎప్పుడో ప్రకటించినా.. అనివార్య కారణాల వల్ల ఇది ఇంకా ప్రారంభం కాలేదు. ఇక, ఈ ఆగస్టులోనో.. సెప్టెంబర్‌లోనే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మొదలవుతుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక ప్రక్రియను హరీశ్ మొదలు పెట్టాడని అంటున్నారు. ఇదిలా ఉండగానే అతడు మరో సినిమాను చేయబోతున్నాడని తెలుస్తోంది. అయితే, ఇది దర్శకుడిగా కాదు.. సమర్పకుడిగా అని టాక్.

Harish Shankar going to present a Movie for Aha

టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ 'ఆహా' అనే పేరుతో ఓటీటీ సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో ఎన్నో వైవిధ్యమైన చిత్రాలను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ కొత్త దర్శకుడితో ప్రయోగాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారట. దీనికి సీనియర్ డైరెక్టర్ దశరథ్ కథను అందిస్తున్నారని తెలిసింది. ఇక, ఈ సినిమాకు హరీశ్ శంకర్ సమర్పకుడిగా వ్యవహరించబోతున్నారని సమాచారం. అంతేకాదు, దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేయబోతున్నాడని అంటున్నారు. ఇది పట్టాలపై ఉన్నా.. పవన్ సినిమాను ప్రారంభిస్తారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X