జూనియర్ ఎన్టీఆర్ కొడుకుపై హరీష్ శంకర్ కామెంట్.. చూస్తుంటే ఇప్పుడే!!

టాలీవుడ్ టాప్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కొడుకుపై ఫేమస్ డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన కామెంట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హరీష్ శంకర్ చేసిన కామెంట్‌లో ఏదో హింట్ ఉండే ఉందని జనాల్లో గుసగుసలు మొదలయ్యాయి. ఇంతకీ హరీష్ ఏమన్నారు? ఏమిటా చర్చ? వివరాల్లోకి పోతే..

Recommended Video

NTR Posts Holi Wishes With Family Picture
హోలీ సంబరాల్లో ఎన్టీఆర్.. వైరల్ పిక్

హోలీ సంబరాల్లో ఎన్టీఆర్.. వైరల్ పిక్

హొలీ పండగ సందర్భంగా రంగులాట ఆడిన అనంతరం తన భార్యాపిల్లలతో కలిసి ఎన్టీఆర్ ఓ ఫొటోకు పోజిచ్చారు. ఈ పిక్‌లో ఎన్టీఆర్, ఆయన భార్య ప్రణతి, కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ ఒకే ఫ్రెములో కనిపించి.. నందమూరి అభిమానులను ఖుషీ చేశారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.

బుల్లి తారకరాములు.. సో క్యూట్

బుల్లి తారకరాములు.. సో క్యూట్

ఎన్టీఆర్ ఇలా ఫ్యామిలీతో దిగిన పిక్‌లో అందరి చూపు ఆయన ఇద్దరు కుమారులపైనే పడుతోంది. ఎన్టీఆర్ కంటే అందంగా, యమ క్యూట్‌గా కనిపిస్తున్నారు ఆ ఇద్దరు బుల్లి తారకరాములు. ఎన్టీఆర్ గడిపిన ఈ సరదా సమయం, ఈ ఫ్యామిలీ పిక్ నందమూరి అభిమానుల హోలీ సంబరాలను హుషారెత్తించింది.

హరీష్ శంకర్ కామెంట్.. లిటిల్ టైగర్ ఆన్ ది వే

హరీష్ శంకర్ కామెంట్.. లిటిల్ టైగర్ ఆన్ ది వే

ఈ ఫ్యామిలీ పిక్‌లో ఎన్టీఆర్ యంగర్ కొడుకును చూస్తుంటే.. లిటిల్ టైగర్ ఆన్ ది వే అన్నట్లుగా ఉన్నాడంటూ కామెంట్ చేశాడు హరీష్ శంకర్. అంతేకాదు ''వదిలితే
ఇప్పుడే దూకేసేలా ఉన్నాడు'' అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ట్వీట్ చేశారు.

బుల్లి తారకరాముడికి వెల్‌కమ్.. నెటిజన్స్ రియాక్షన్

బుల్లి తారకరాముడికి వెల్‌కమ్.. నెటిజన్స్ రియాక్షన్

దీంతో హరీష్ చేసిన ఈ ట్వీట్ చూసి బుల్లి తారకరాముడికి వెల్‌కమ్ చెబుతూ పెద్ద ఎత్తున రిప్లై ఇస్తున్నారు నెటిజన్లు. ఇప్పటికే మహేష్ బాబు కొడుకు గౌతమ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. సో.. అదే బాటలో ఇప్పుడు ఎన్టీఆర్ కొడుకు కూడా సినీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని, హరీష్ బాగా చెప్పారని రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు.

రాజమౌళితో RRR.. 'అయినను..' త్రివిక్రమ్

ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న RRR సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమాను లైన్‌లో పెట్టేశారు యంగ్ టైగర్. అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు 'అయినను.. పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X