Harish Shankar: ప్రస్తుతం వారాహి వెకేషన్.. సినిమా రిలీజైతే సెన్సేషనే.. పవన్ సినిమాపై హరీష్ లీక్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో రాబోతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటించబోతుంది. అయితే మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ.. పవన్ కల్యాణ్ ఓ వైపు సినిమాలు మరోవైపు రాజకీయాలు చేస్తుండడంతో ఈ సినిమా షూటింగ్ ఆగోపోయింది. చాలా రోజులుగా హరీష్ శంకర్ పవన్ కల్యాణ్ డేట్స్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు.

అయితే తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న స్టాపబుల్ సీజన్ 3 షోకి వచ్చాడు. ఈక్రమంలోనే పవన్ కల్యాణ్ సినిమాపై ఆయనపై షాకింగ్ కామెంట్లు చేశారు. తాజాగా విడుదల అయిన ప్రోమో చూస్తుంటే ఈ విషయం అర్థం అయిపోతుంది. ముఖ్యంగా బాలకృష్ణ హరీష్ శంకర్ ను అనేక ప్రశ్నలు అడగ్గా.. ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించిన పలు విషయాలను చెప్పారు. అయితే ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుకుందాం.

Harish Shankar Leaked Pawan Kalyan Ustaad Bhagat Singh Movie Updates

ఏంటి వారాహి హాలీడేస్ హా ఫ్రీగా ఉన్నావ్..

ప్రోమో ప్రారంభం అయిన తర్వాత హరీష్ శంకర్ పై చాలా జోకులు వేసిన బాలయ్య బాబు ఆ తర్వాత... ఏంటి వారాహి హాలీడేస్ హా ఫ్రీగా ఉన్నావంటూ హరీష్ శంకర్ ను అడిగారు. అందుకు ఏం చెప్పాలో తెలియకు ముందుగా నవ్విన హరీష్ శంకర్ ఆ తర్వాత సమాధానం చెప్పారు. ఈ గ్యాప్ మట్టుకే వెకేషన్.. సినిమా రిలీజయ్యాక సెన్సేషనే అంటూ చెప్పగా అంతా అరిచారు. పవన్ కల్యాణ్ పేరు వినిపించినా ఆయ సినిమా గురించి ఏదైనా అప్ డేట్ వచ్చిన అభిమానుల నుంచి రెస్పాన్స్ ఇలాగే ఉంటుంది. ఇక ఆ తర్వాత మేమే మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతామని అనగా.. కాపీ కొట్టకు బ్రో.. మెలికలు తిరగకు బ్రో అంటూ హరీశ్ శంకర్ ను ఏడిపించాడు బాలకృష్ణ.

అయితే ప్రశ్నలు అడగడం ప్రారంభించిన సుహాసిని.. గెస్టుల్లో ఎవరైనా మీరు ఎక్స్ పెక్ట్ చేసినట్లు మాట్లడలేరు అని అనిపించిందా అనగానే.. బాలకృష్ణ అదీ అదీ అంటూ నీళ్లు నమిలాడు. అంతలోనే హరీష్ శంకర్.. ఎవరు ఎవరు అంటూ అడగ్గా.. మీవాడే అని చెప్పాడు. అప్పుడే హరీష్ శంకర్.. తన పవన్ కల్యాణ్ మేనరిజాన్ని చూపించారు. ఆ సమయంలోనే భీమ్లా నాయక్ మ్యూజిక్ వేశారు. దీంతో బాలకృష్ణ ఆన్సర్ పవన్ కల్యాణ్ యే అని అర్థం అవుతుంది. ఇక ఎక్కువగా మాట్లాడిన వాళ్లు ఎవరు అంటే రవితేజ అని తేల్చి చెప్పాడు బాలా బాబు.

Harish Shankar Leaked Pawan Kalyan Ustaad Bhagat Singh Movie Updates

ఎవరైనా గెస్టును ప్రశ్నలు అడగడం మర్చిపోయారా అంటే నిన్ను చూసే మర్చిపోయానని చెబుతూ.. శ్రియకు లవ్ సింబల్ పెట్టి చూపించాడు. ఆ తర్వాత చెన్నకేవశ రెడ్డి సినిమాలోని పాటకు ఇద్దరూ స్టెప్పులు వేసి అదరగొట్టారు. ఇలా ప్రోమో పూర్తవగా.. డిసెంబర్ 22వ తేదీ నుంచి ఆహా వేధికగా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించారు. ప్రోమోలోనే అదిరిపోయే విషయాలను చెప్పిన హరీష్ శంకర్... ఎపిసోడ్ లో కూడా చాలానే విషయాలు చెప్పి ఉంటాడని అర్థం అవుతోంది. సో వచ్చిన వెంటనే చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X