రవితేజకు వయసు ఎక్కువైతే ఏంటి? శ్రీలీల, భాగ్యశ్రీకి లేని బాధ మీకెందుకు? హరీష్ ఫైర్
ప్రస్తుతం తెలుగు సినిమాని రూల్ చేస్తున్న హీరోయిన్స్ లో దాదాపు యంగ్ హీరోయిన్స్ దాదాపు 30 లోపే మందే ఉన్నారని చెప్పాలి. కాగా ఈ లిస్ట్ లో హిందీ సహా తమిళ్, మలయాళం నుంచి కూడా వచ్చిన స్టార్ హీరోయిన్స్ ఉండగా మన తెలుగు నుంచి అయితే తెలుగు హీరోయిన్ గా శ్రీలీల టాలీవుడ్ ని రూల్ చేస్తుంది. కాగా ఇపుడు శ్రీలీల తన చేతిలో చాలా సినిమాలే పెట్టుకుంది కానీ ఈమె నటించిన చిత్రాల్లో ఓ సినిమాకి మాత్రం పెద్ద ఎత్తున ట్రోల్స్ పడ్డాయి అది కూడా తన మీద కాదు కానీ తన మూలాన స్టార్ హీరోపై ట్రోల్స్ పడ్డాయి.
మరి ఆ చిత్రమే "ధమాకా". దర్శకుడు త్రినాధరావు నక్కిన తెరకెక్కించిన ఈ క్రేజీ ఎంటెర్టైనెర్ పెద్ద హిట్ అయ్యింది. ఓ రకంగా చెప్పాలంటే శ్రీలీల ని స్టార్ గా చేసింది కూడా ఈ సినిమానే అని చెప్పడంలో సందేహం లేదు. కాగా ఈ చిత్రంలో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించారు. అయితే ఈ సినిమాకి రవితేజ అండ్ శ్రీలీల నడుమ చాలా ఏజ్ గ్యాప్ ఉన్న సంగతి తెలిసిందే.

దీనితో కొన్ని రొమాంటిక్ పోస్టర్ లు చూసి రవితేజని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. అక్కడ నుంచి రవితేజ విషయంలో సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్స్ చేస్తూ వచ్చారు. కాగా రీసెంట్ గా మరో యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్ విషయంలో కూడా చాలా ట్రోల్స్ పడ్డాయి. ఇలా రవితేజ అండ్ హీరోయిన్స్ విషయంలో నడుస్తున్న కాంట్రవర్సియల్ ట్రోల్స్ పట్ల తాజాగా తన దర్శకుడు హరీష్ శంకర్ అయితే ఆ ట్రోల్స్ చేస్తున్న వారిపై ఫైర్ అయ్యారు.
అసలు వారికేం తెలుసని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. అసలు సినిమాకి వయసుకి సంబంధం ఏముంటుంది అని సినిమాలో హీరో, హీరోయిన్స్ పై స్క్రీన్ ఏజ్ అనేది ఎప్పుడు కరెక్ట్ గానే తీసుకుంటాం. అసలు ఒక హీరో లేదా హీరోయిన్ బయట ఒక ఏజ్ ఉంటే సినిమాలో కూడా ఆ ఏజ్ లోనే కనిపిస్తారని ఎలా అనుకుంటున్నారు? మినిమమ్ కామన్ సెన్స్ లేదేంట్రా మీకు అంటూ ఫైర్ అయ్యారు. అయినా ఒక హీరోయిన్ అన్నీ తెలిసే ఒక సినిమా ఓకే చేసి సంతకం పెట్టినపుడు వాళ్ళకి లేని ప్రాబ్లమ్ మీకేంటి అసలు అసలు అని హరీష్ తన మార్క్ ఫైర్ ఆన్సర్ ఇచ్చారు.
ధమాకా హిట్టయింది కాబట్టి చిన్న పిల్లని పెట్టారు కాబట్టి సక్సెస్ అయ్యింది అని అంటారా? సక్సెస్ అయ్యిన తర్వాత ఏజ్ కోసం మాట్లాడలేదు ఇలా హిట్టయ్యాక ఒక మాట హిట్ కాకపోతే ఒక మాట్లాడ్డం కరెక్ట్ కాదని హరీష్ అయితే ఏజ్ విషయంలో నడుస్తున్న కొన్ని కాంట్రవర్సీలు కొన్ని ట్రోల్స్ పై మాత్రం గట్టి సమాధానం ఇచ్చేసారు. దీంతో ఈ కామెంట్స్ పట్ల రవితేజ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు వీరి కాంబినేషన్ లో వస్తున్న మిస్టర్ బచ్చన్ ఈ ఆగస్ట్ 15న విడుదల కాబోతుంది. ఈ చిత్రాన్ని టిజి విశ్వప్రసాద్ నిర్మాణం వహించారు.


Click it and Unblock the Notifications











