ఎన్టీఆర్ వదిలేసిన కథతోనే గబ్బర్‌సింగ్ కాంబినేషన్.. పవన్‌ను అలా బుట్టలో పడేసిన హరీష్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాప్ లేకుండా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న విషయం తెలిసిందే. కరోనా లేకపోతే ఈపాటికి థియేటర్స్ లో పవర్ స్టార్ అభిమానుల సందడి మొదలయ్యేది. వకీల్ సాబ్ మరికొన్ని రోజులు వాయిదా పడక తప్పలేదు. ఇకపోతే ప్రస్తుతం పవన్ తన తదుపరి సినిమాలకు సంబంధించిన కథలపై చర్చలు జరుపుతున్నారు. అయితే ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ఒక కథకు పవన్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

మరీంత ఆలస్యం..
రెండు నెలలపాటు థియేటర్స్ తెరిచే ప్రసక్తే లేదని గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడంతో పవర్ స్టార్ వకీల్ సాబ్ సినిమా ఇప్పట్లో వచ్చేలా లేదని తెలుస్తోంది. రెండు నెలల తరువాత కూడా పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి సినిమా విడుదలకు మరీంత ఎక్కువ సమయం పట్టేలా ఉందనిపిస్తోంది. దిల్ రాజు ప్రొడక్షన్ లో రూపొందిన ఆ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

నెక్స్ట్ సినిమాలు..
అభిమానుకు ఎంతగానో ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ రిలీజ్ వాయిదా పడటంతో ఆ తరువాత చేయబోయే సినిమాలను వీలైనంత త్వరగా విడుదల చేయాలని పవన్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే క్రిష్ తో పిరియడిక్ డ్రామాను సెట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత హరీష్ శంకర్ ప్రాజెక్టును కూడా వేగంగా ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు.

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథ?
సాధారణంగా ఒక హీరో రిజెక్ట్ చేసిన కథలు మరొక హీరో చేసి హిట్టు కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక గతంలో ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ఒక మాస్ ఎంటర్టైనర్ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దర్శకుడు హరీష్ శంకర్ ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్యా అనే సినిమా కంటే ముందే ఒక కథను చెప్పగా దాన్ని రిజెక్ట్ చేశాడట. ఇక ఇప్పుడు కొద్దిపాటి మార్పులతో పవన్ కళ్యాణ్ కి వినిపించగా ఓకే చేసినట్లు తెలుస్తోంది.
Recommended Video

సెట్టయ్యింది..
హరీష్ ముందు చెప్పిన కథను కాదని రామయ్య వస్తావయ్యా కథను ఎన్టీఆర్ ఎంతో ఇష్టపడి చేశాడు. కానీ ఆ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. ఇక ఆ తరువాత హరీష్ శంకర్ తో రిజెక్ట్ చేసిన కథపై చర్చలు జరిపినప్పటికి ఎందుకో సెట్టవ్వలేదు. ఇక ఫైనల్ గా గబ్బర్ సింగ్ కాంబినేషన్ కోసం ఆ కథ పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











