ముగ్గురు హీరోలతో మల్టీస్టారర్.. రూమర్‌పై దర్శకుడి స్పందన!
గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ డీజే తరువాత కొత్త చిత్రాన్ని ఇంకా ప్రారంభించలేదు. అల్లు అర్జున్ తో తెరకెక్కించిన డీజే గత ఏడాది విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కమర్షియల్ చిత్రాలని తెరకెక్కించడంలో హరీష్ శంకర్ సిద్ధహస్తుడు. డీజే తరువాత దిల్ రాజు నిర్మాణంలో దాగుడు మూతలు అనే మల్టీస్టారర్ ని ప్రారంభించాడు. కానీ ఆ చిత్రం ఆగిపోయింది.
ఇప్పుడు హరీష్ శంకర్ మరో మల్టీస్టారర్ కు ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం మొదలయింది. ముగ్గురు యువహీరోలతో తమిళ సూపర్ హిట్ చిత్రం జిగర్తాండని తెలుగులో రీమేక్ చేసేందుకు హరీష్ సన్నాహకాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, యువ హీరోలు నాగ శౌర్య, రాజ్ తరుణ్ ఈ చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వరుణ్ తేజ్ ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఈ రూమర్ పై హరీష్ శంకర్ స్పందించాడు. తాను మల్టీస్టారర్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలని ఖండించాడు. తన సినిమా గురించి తానే అధికారికంగా ప్రకటిస్తానని, అంతవరకు అసత్యాలు ప్రచారం చేయవద్దని కోరాడు.


Click it and Unblock the Notifications











