ఒకరి చావు నాకు బోలెడు రిలీఫ్ ఇస్తుందని అనుకోలేదు: హరీష్ శంకర్ కామెంట్స్

ఓ వైపు కరోనా కలకలం.. మరోవైపు నిర్భయ దోషుల ఉరికంబం. ఈ రెండు అంశాలే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రెండింటి పైనా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తూ తమ తమ అభిప్రాయాలు, సూచనలు పోస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హరీష్ శంకర్ రియాక్ట్ అవుతూ ట్వీట్ చేశారు.

ఒకరి చావు నాకు బోలెడు రిలీఫ్ ఇస్తుంది అని ఎప్పుడూ అనుకోలేదు. అలాగే కొంత మందికి భయాన్నిస్తే చాలు !!! అంటూ హరీష్ శంకర్ సందేశమిచ్చారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు హరీష్‌ని సమర్థిస్తూ రియాక్ట్ అవుతున్నారు. ''ఆ భయం అనేది ఉండాలంటే ఇలాంటి శిక్షలే త్వరితగతిన అమలుకావాలి'' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Harish Shankar reaction on Nirbhaya verdict

ఈ రోజు (శుక్రవారం) ఉదయం నిర్భయ దోషుల ఉరితీతపై హరీష్ ఈ రకంగా స్పందించడం చూసి.. ఎస్ ట్రూ.. నీవు ఎప్పుడూ కరెక్ట్ గానే చెబుతావు అని ఆయన అభిమానులు అంటున్నారు. 2012 నిర్భయ హత్యాచారం కేసులో నిందితులైన మొత్తం నలుగురు ముఖేష్ సింగ్, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మలను నేటి ఉదయం 5 గంటల 30 నిమిషాలకు పారామిలటరీ బలగాల భద్రత మధ్య ఢిల్లీలోని తిహార్ జైలులో ఉరి తీశారు. ఈ అంశంపై దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X