ఆసక్తి పెంచేస్తోన్న ఓ పిట్ట కథ కాన్సెప్ట్ పోస్టర్
ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ హీరోగా వస్తోన్న చిత్రం ఓ పిట్ట కథ. త్రివిక్రమ్ లాంటి దర్శకుడి చేత పోస్టర్‌ను రిలీజ్ చేయించడంతో అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఓ పిట్ట కథ అంటూ తన కథను వినిపించడం దానిక ఇట్సే లాంగ్ స్టోరీ అంటూ క్యాప్షన్ పెట్టమని తానే సలహా ఇచ్చినట్టు త్రివిక్రమ్ పేర్కొనడం సినిమాపై అంచనాలు పెంచేలానే ఉంది. నిన్న విడుదల చేసిన పోస్టర్‌లో చాలా విషయాలనే హింట్‌గా వదిలారు.
పేదవాడైన హీరో (ప్రభు)కు సింబర్ చాయ్ గ్లాస్‌ను ఉంచారు.. అమ్మాయి (వెంకట లక్ష్మీ)కి సింబాలిక్‌గా ఒకప్పుడు ఇంట్లో టీ తాగే పద్దతిలో ఓ గ్లాస్‌ను పెట్టారు.. మరోవైపు పెద్దింటి వాడైన (క్రిష్) హీరో తాగే కాఫీని ఉంచారు. మొత్తంగా చూసే అదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనిపించేలానే ఉంది. తాజాగా వదిలిన కాన్సెప్ట్ పోస్టర్‌లోనూ అదే కనిపిస్తోంది.

కాసేపటి క్రితమే మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ పిట్టకథ కాన్సెప్ట్‌ను రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్‌లోనూ అదే మాదిరిగా.. మామూలుగా హీరో పాత్ర (ప్రభు) వేసుకునే ప్యారగాన్ చెప్పులు, హీరోయిన్ పాత్ర (వెంకట లక్ష్మీ) వేసుకునే చెప్పులు, మరో కథానాయకుడు (క్రిష్) వేసుకునే బ్రాండెడ్ షూస్ ఉన్న పోస్టర్‌ను వదిలారు. పోస్టర్‌లోనే కొత్తదనం కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
చందు ముద్దు దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ సంస్థపై ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











