పవన్ సినిమా పని మొదలెట్టిన హరీశ్: వాళ్లందరితో చర్చలు జరుపుతోన్న డైరెక్టర్
రీఎంట్రీలో వరుస సినిమాలను ప్రకటిస్తూ దూసుకుపోతున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పటికే 'వకీల్ సాబ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతడు.. ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడితో కలిసి 'హరిహర వీరమల్లు' అనే పిరియాడిక్ మూవీని కూడా చేస్తున్నాడు. మెగాసూర్య బ్యానర్‌పై ఏఎమ్ రత్నం ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అలాగే, మలయాళ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్‌లో దగ్గుబాటి రానాతో కలిసి నటిస్తున్నాడు. సాగర్ కే చంద్ర రూపొందిస్తోన్న ఈ సినిమాను సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు.
ఈ సినిమాలే కాకుండా పవన్ కల్యాణ్ మరో ప్రాజెక్టును సైతం ప్రకటించాడు. దాన్ని స్టైలిష్ డైరెక్టర్ హరీశ్ శంకర్ రూపొందించబోతున్నాడు. ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ మూవీ కాస్టింగ్‌ను హరీశ్ శంకర్ ఇప్పటికే ప్రారంభించాడట. ఇందులో భాగంగానే పలువురు సినీ ప్రముఖులతో సంప్రదింపులు కూడా జరిపాడని తెలుస్తోంది. ఇలా ఈ పాటికే ముఖ్యమైన పాత్రల కోసం కొందరిని ఎంపిక కూడా చేసుకున్నాడని అంటున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే రాబోతుందని తెలిసింది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ డుయల్ రోల్ చేస్తున్నాడని కూడా కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఎంతో నిజాయితీగా ఉండే పోలీస్ ఆఫీసర్‌గా తండ్రి పాత్ర ఉంటే.. పూర్తి మాస్ బ్యాగ్‌డ్రాప్‌తో కొడుకు రోల్ ఉంటుందని తెలిసింది. ఇప్పటి వరకూ టాలీవుడ్‌లోని ఏ హీరోకూ కుదరని క్యారెక్టరైజేషన్ ఇందులో పవన్ కోసం డిజైన్ చేశాడట దర్శకుడు హరీశ్ శంకర్. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











