twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Harish Shankar ట్వీట్ వార్.. తేజ్ విషయంలో చానెళ్ళను టార్గెట్ చేయడంతో సెన్సార్ కామెంట్స్?

    |

    సినీ నటుడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రమాదం వ్యవహారం ఇంకా హాట్ టాపిక్ గానే ఉంది. ఒక పక్క ఆయన హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉంటే ఆయన యాక్సిడెంట్ గురించి మీడియాలో రకరకాల వార్తలు వెలువడుతున్నాయి అయితే సాయి ధరమ్ తేజ్ ఎదురుగా ఉన్న చాలా మంది దర్శకులు అలాగే మెగా అభిమానులు కూడా ఈ విషయంలో మీడియా దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ వ్యవహారంలో హరీష్ శంకర్ చేసిన కొన్ని ట్వీట్లు ఇప్పుడు మీడియా వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

    అమ్మో రచ్చ

    అమ్మో రచ్చ

    సాయి ధరమ్ తేజ్ ప్రమాదం జరిగిన తర్వాత మీడియా చానళ్లు అత్యుత్సాహంతో అనేక కథనాలు వండి వారుస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన తీరును కూడా రీ కన్స్ ట్రక్ట్ చేసి చూపించే విధంగా కథనాలు వెలువరించారు. అంత అవసరం లేదని అయినా సరే సినిమా హీరో కావడంతో ఇలా ప్రాధాన్యత ఇచ్చి ఏదో జరిగిపోతోంది అనే ఉద్దేశాన్ని ప్రజలలో కల్పించే విధంగా ప్రవర్తిస్తున్నారు అనే విమర్శలు చేస్తున్నారు.

     ఆ అన్నం అరగాలి

    ఆ అన్నం అరగాలి

    ఈ మేరకు హరీష్ శంకర్ నిన్న వరుస ట్వీట్లు చేశారు. సాయి ధరమ్ తేజ్, హాట్స్ ఆఫ్ తమ్ముడు హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా ఎందరికో అన్నం పెడుతున్నావ్, నీ ఆక్సిడెంట్ వంకతో తప్పుడు వార్తలు అమ్ముకొని బతికేస్తున్న అందరూ బాగుండాలి వాళ్ళకి ఆ అన్నం అరగాలి అని కోరుకుంటున్నాను, అంటూ ట్వీట్ చేశారు .

    ఇతరుల ప్రాణాలు కూడా ముప్పు

    ఇతరుల ప్రాణాలు కూడా ముప్పు

    వెంటనే రంగంలోకి దిగిన ఒక ఛానల్ ఇన్ ఫుట్ ఎడిటర్ ''మీడియా వాళ్ళని విమర్శించడం ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది, తప్పుడు కథలు, కథనాలు హింసను ప్రేరేపించే సినిమాలు తీస్తూ మీరు కోట్లు సంపాదించుకోవచ్చు, కానీ తప్పుడు వార్తలు అంటూ తప్పు పడతారు అతి వేగంగా వెళ్లి మీరు ప్రమాదానికి గురి కావడం కాదు ఇతరుల ప్రాణాలు కూడా ముప్పు తెస్తున్నారు'' అంటూ దానికి రిప్లై ఇచ్చారు.

    మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు

    మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు

    అయితే దానికి స్పందించిన హరీష్ శంకర్ '' నేను " తప్పుడు వార్తలు "అని క్లియర్ గా మెన్షన్ చేశాను కదా మీరెందుకు అందరికంటే ముందు భుజాలు తడుముకుంటున్నారు ... అంటే ... ఒప్పుకున్నట్టేనా ? క్లారిటీ ఇచ్చినందుకు థాంక్స్ అని పేర్కొన్నారు, అలాగే ఇక పోతే మా సినిమాల్లో హింస అన్నారు మాకు సెన్సార్ ఉంది మేము వాళ్లకు సమాధానం చెప్పాలి" అని పేర్కొన్నారు.

    సెన్సార్ గురించి చెప్పకర్లేదు

    సెన్సార్ గురించి చెప్పకర్లేదు

    అంతే కాక ''మీకేముంది మీరు దేనికి సమాధానం చెప్పాలో కాస్త చెబుతారా ? రమేష్ గారు నేను మీ వ్యవస్థని తప్పు పట్టట్లేదు వ్యవస్థని తప్పు దోవ పట్టించే వాళ్ల గురించి చెబుతున్నాను !! దయచేసి ఇక్కడ సమస్య అర్ధం చేసుకోండి అని పేర్కొన్నారు. అయితే ఇక్కడితో ఈ వ్యవహారం ముగుస్తుందని అందరూ అనుకున్నా, మళ్లీ మొదటికి వచ్చింది.

    దానికి స్పందించిన రమేష్ అనే జర్నలిస్ట్ ''థాంక్స్ హరీష్ శంకర్ గారు, మీరు రిప్లై ఇచ్చినందుకు, వ్యక్తిగా సమాజానికి జవాబుదారున్ని , జర్నలిస్ట్ గా ప్రశ్నించే గొంతుని . ఇక సెన్సార్ అంటారా అది ఎలా చేస్తారో మెంబర్ గా చేసిన నాకు తెలుసు, అంటూ అరవింద సమేత వీర రాఘవ సినిమాకు ఆయన సెన్సార్ మెంబర్ గా ఉన్నట్టున్న ఒక సర్టిఫికెట్ కూడా జత చేశారు.

    Recommended Video

    Seetimaarr Movie Team Vinayaka Chaviti Special Interview
    మేమేస్తాం మీరేస్తారా

    మేమేస్తాం మీరేస్తారా

    దానికి హరీష్ శంకర్ స్పందిస్తూ మరి సెన్సార్ మెంబర్ గా చేశా అంటున్నారు కదా ఈ సినిమా లోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం నిజం కాదు అని మేము వేస్తాం ; మీరు న్యూస్ ముందు ఇదంతా నిజం కాదు కేవలం మా ఛానల్ కల్పితం అని వేయండి మరి ! జనాలకి ఒక క్లారిటీ ఉంటది !! లేదా దయచేసి సినిమాను వార్తలతో కంపేర్ చేయడం ఆపేయండి అని అన్నారు. దీంతో జర్నలిస్ట్ సైలెంట్ అయ్యారు.

    English summary
    director Harish shankar targets media channels in sai dharam tej accident issue and made a series of tweets.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X