Game Changer: చరణ్ సినిమాలో బాలీవుడ్ స్టార్.. అసలు ట్విస్ట్ ఇచ్చేది అతడేనట
ఏ రంగంలోనైనా వారసులుగా పరిచయమైన వాళ్లు టాలెంట్ ఉంటేనే రాణించగలుగుతారు. అంతేకాదు, విశేషంగా ఆకట్టుకుంటే హై రేంజ్‌కు ఎదుగుతారు. సినీ రంగంలో దీనికి ప్రత్యేక ఉదాహరణగా నిలిచిన స్టార్ కిడ్‌లు ఎంతో మంది ఉన్నారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. బడా బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చినా.. కెరీర్ కొత్తలోనే తనదైన టాలెంట్లతో స్టార్‌గా ఎదిగిన అతడు.. RRR(రౌద్రం రుధిరం రణం) అనే మూవీతో గ్లోబర్ స్టార్ అనే పేరును కూడా దక్కించుకున్నాడు. దీంతో యమ జోష్‌తో సినిమాలు చేస్తూ వెళ్తోన్నాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఇండియాలోనే దిగ్గజ దర్శకుడిగా పేరొందిన ఎస్ శంకర్‌తో కలిసి 'గేమ్ చేంజర్' అనే సినిమాను చేస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయినా మధ్యలో కొన్ని అనుకోని అవాంతరాలు వచ్చాయి. అయినప్పటికీ దీనికి సంబంధించిన 70 శాతానికి పైగా టాకీ పార్ట్ కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నారు. ఇక, మిగిలిన పార్టును కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చిత్ర యూనిట్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే న్యూస్ ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది.

రామ్ చరణ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'గేమ్ చేంజర్' సినిమాలో ఎంతో మంది స్టార్లు కీలక పాత్రలను పోషిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో బాలీవుడ్ ఫేమస్ యాక్టర్ హ్యారీ జోష్ విలన్ పాత్రను చేస్తున్నట్లు తెలిసింది. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఎపిసోడ్‌లో ఎస్‌జే సూర్య విలన్‌గా చేస్తుండగా.. ప్రస్తుత కాలంలో మాత్రం ఈ బాలీవుడ్ నటుడే ప్రతినాయకుడిగా కనిపిస్తాడట. అంతేకాదు, అతడి గురించి తెలిసే ఓ ట్విస్ట్ సినిమాలో అదిరిపోతుందని తెలిసింది. ఇదిలా ఉండగా.. గతంలో హ్యారీ 'బద్రీనాథ్'లో విలన్‌గా చేశాడు. ఆ తర్వాత బాలీవుడ్‌లో చాలా చిత్రాల్లో నటించాడు.
'గేమ్ చేంజర్' మూవీలో రామ్ చరణ్‌కు జోడీగా కియారా అద్వాణీ చేస్తోంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దీనికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ మూవీని వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











