ప్రభాస్ కోసం అర్జున్ రెడ్డి సెంటిమెంట్: డార్లింగ్స్ కోరుకున్నవే ఉంటాయట!
తెలుగు సినిమా హీరోగా సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటి.. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటుతూ భారీ చిత్రాల్లోనే నటిస్తున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఇలా ఇప్పటికే చాలా సినిమాను కూడా ప్రేక్షకులకు అందించాడు. వాటి ఫలితాలు ఎలా తన రేంజ్‌ను మాత్రం ఇంకా ఇంకా పెంచుకుంటూ.. మరిన్ని మూవీలను చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు.
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇటీవలే 'ఆదిపురుష్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ ఆడియెన్స్ రెస్పాన్స్‌ను అందుకోవడంలో విఫలమై బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఇక, ఇప్పుడు ప్రభాస్ 'సలార్', 'ప్రాజెక్టు K' చిత్రాలతో పాటు మారుతి దర్శకత్వంలోనూ ఓ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. వీటితో పాటు అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే ఈ సినిమాకు 'స్పిరిట్' అనే టైటిల్ పెట్టారు. దీన్ని పాన్ వరల్డ్ రేంజ్‌లో ఎనిమిది భాషల్లో రూపొందిస్తున్నారు.

సందీప్ రెడ్డి - ప్రభాస్ కాంబినేషన్‌లో రాబోయే సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడి చాలా కాలమే అవుతోన్నా.. ప్రభాస్ వేరే చిత్రాలతో బిజీగా ఉండడంతో ఇప్పటి వరకూ చిత్రీకరణ మాత్రం ప్రారంభం కాలేదు. దీనికితోడు సందీప్ 'యానిమల్' మూవీ పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే, ఇప్పుడు ఆ చిత్రం వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. దీంతో ఈ డాషింగ్ డైరెక్టర్ ప్రభాస్ మూవీకి సంబంధించిన పనులపై ఫోకస్ చేసినట్లు తెలిసింది. ఈక్రమంలోనే తాజాగా అతడు ఓ టెక్నీషియన్‌ను ఫైనల్ చేశాడని న్యూస్ వైరల్ అవుతోంది.
'స్పిరిట్' మూవీ భారీ యాక్షన్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందనున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే దీన్ని హై రేంజ్‌లో రూపొందించబోతున్నారు. ఇక, ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా 'అర్జున్ రెడ్డి' ఫేం హర్షవర్థన్ రామేశ్వర్‌ను సందీప్ రెడ్డి వంగా ఫైనల్ చేశాడని తెలిసింది. ప్రస్తుతం అతడు 'యానిమల్'కు బ్యాంగ్రౌడ్ స్కోర్ ఇస్తున్నాడు. ఈ వర్క్ బాగా నచ్చడంతో ప్రభాస్ సినిమాకు కూడా అతడినే తీసుకున్నాడని సమాచారం. ఇందులో ఫ్యాన్స్ కోరుకునే ట్యూన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్‌ను ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'స్పిరిట్' మూవీలో బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ విలన్‌గా నటిస్తున్నట్లు ఆ మధ్య ఓ న్యూస్ వైరల్ అయింది. అలాగే, ఎంతో మంది ప్రముఖులు ఇందులో కీలక పాత్రలు చేస్తున్నారని అంటున్నారు. ఇక, ఈ చిత్రాన్ని భూషన్ కుమార్ నిర్మిస్తోన్నారు. ఇది వచ్చే ఏడాది ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











