Kannappa 2 : కన్నప్ప 2కి మంచు విష్ణు ప్లానింగ్.. ఏ జోనర్ లో రాబోతుందంటే?

మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. జూన్ 27న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుందడం విశేషం. రూ.200 కోట్లతో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరగడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశాజనకంగా ప్రయాణిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఈ చిత్రానికి ప్రస్తుతం పాజిటివ్ రివ్యూస్ దక్కుతుండడం విశేషం. దీంతో సీక్వెల్ ఉంటుందా అనే ప్రశ్నపై మంచు విష్ణు కూడా ఆసక్తికరంగా స్పందించారు.

కన్నప్ప కు భారీ స్పందన..
ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన కన్నప్ప చిత్రానికి ప్రేక్షకుల నుంచి మాత్రం మంచి స్పందన కనిపిస్తోంది. ఇప్పటికే 2.5 కోట్ల రూపాయలు ప్రీ సేల్స్ బిజినెస్ జరగడం విశేషం. బుక్ మై షో రిపోర్టు ప్రకారం కూడా తొలి రోజు బుకింగ్స్ అదిరిపోయాయి. దీంతో బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. భారీ తారాగణం నటించడంతో ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లోనూ సినిమాకు భారీ స్పందన లభిస్తుంది.

Have Sequel to Manchu Vishnu Kannappa Movie

కన్నప్పకు సీక్వెల్ కావాలంటే : మంచు విష్ణు
కన్నప్ప చిత్రాన్ని మేకర్స్ భారీ స్థాయిలో ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లోను ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహించారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో ఏదైనా చిత్రం బ్లాక్ బాస్టర్ గా నిలిస్తే దానికి సీక్వెల్ ను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ చిత్రానికి సీక్వెల్ పై మంచు విష్ణు ఆసక్తికరంగా స్పందించారు. సీక్వెల్ ఉండటం ఈ కథతో సాధ్యమయ్యే పని కాదని స్పష్టం చేశారు. కానీ సూపర్ హీరోగా సీక్వెల్ కు ప్లాన్ చేసే అవకాశం ఉందన్నారు. అది కూడా శివుడి ఆశీర్వాదంతో జరగాలని చెప్పారు. దీంతో సీక్వెల్ పై ఇలా సప్పెన్స్ ను క్రియేట్ చేశారు.

కన్నప్ప 2 సాధ్యమేనా?
శివ భక్తుడు తిన్నన్ జీవిత ఆధారంగా తెరకెక్కిన చిత్రం కన్నప్ప. నాస్తికుడైన తిన్నడు శివుడికి పరమభక్తుడిగా ఎలా మారాడు. అంతకు ముందు ఆయన జీవితం ఎలా మారిందనే ప్రధాన కథగా సాగుతుంది. ఈ క్రమంలోనే ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ పాత్రలు వచ్చి కథనాసారంగా అలరిస్తాడు. చివరిగా తిన్నడు శివుడిలో ఐక్యం అయిపోతాడు. దాంతో తిన్నడి జీవిత కథ ముగుస్తుంది. దీంతో తిన్నడిగా మంచు విష్ణు కన్నప్ప 2 చేయడం సాధ్యం కాదనే చెప్పాలి. ఇక మంచు విష్ణు అన్నట్టుగా సూపర్ హీరో వెర్షన్ లో సినిమా తీయాలంటే కన్నప్ప బాక్సీఫీస్ వసూళ్లపై ఆధారపడి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రం తెచ్చే కలెక్షన్లపై కన్నప్ప 2 వస్తుందా? రాదా? అనేది తేలనుందని అంటున్నారు.

కన్నప్ప చిత్రం విశేషాలు..
మంచు విష్ణు కన్నప్ప చిత్రం మొదటి భాగం అంతంత మాత్రమే ఉంటుందని ప్రేక్షకుల నుంచి స్పందన లభిస్తోంది. ఇక ద్వితియార్థంలో మాత్రం ప్రభాస్ ఎంట్రీతో సినిమా నెక్ట్స్ లెవల్ కు వెళ్తుందని చెబుతున్నారు. ఇలా సినిమాకు ఫస్ట్ హాఫ్ తో కాస్తా అప్సెట్ జరిగినా సెకండ్ హాఫ్ తో మాత్రం ప్రభాస్ వల్ల హైనిస్తుందని తెలుపుతున్నారు. ఈ చిత్రంలోని యుద్ధ సన్నివేశాలు, ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అదిరిపోయిందని, విజువల్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయని, ముఖ్యంగా కథకు తగ్గట్టుగా సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉందని ప్రేక్షకులు తెలుపుతున్నారు.

More from Filmibeat

Read more about: manchu vishnu kannappa prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X