Kalki 2898 AD Trailer Leak: లీకైన కల్కి 2898 ఏడీ మూడో ట్రైలర్ చూసారా? ప్రభాస్ ఊహించని షాకిచ్చాడుగా!
ఒక సినిమాని అత్యంత జాగ్రత్తగా తెరకెక్కించి థియేటర్స్ వరకు తీసుకురావడం అనేది కత్తి మీద సామే అని చెప్పాలి. ఒకప్పుడు అంటే ఓకే కానీ ఇప్పుడు మాత్రం ఓ సినిమాని ఎలాంటి లీక్ లేకుండా జాగ్రత్త పడటం అనేది దాదాపు అసాధ్యం అని చెప్పాల్సిందే. ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయిన టెక్నాలజీ, సోషల్ మీడియాలతో అందరి చేతిలో మొబైల్ ఫోన్స్ ఉండడంతో అవుట్ డోర్ ఇన్ డోర్ ఎక్కడ షూట్ చేసినా కూడా లీక్స్ రూపంలో సినిమాల తాలూకా విజువల్స్ బయటకి వచ్చేస్తున్నాయి.
మరి ఇవి ఎలాంటి భారీ సినిమాకి అయినా తప్పడంలేదు. అలాంటి సినిమాల్లో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కించిన తాజా చిత్రం 'కల్కి 2898 ఎడి' కూడా ఒకటి. కాగా ఈ భారీ చిత్రం మొదలైన సమయంలో ఎలాంటి లీక్స్ రాలేదు కానీ నెమ్మదిగా మొదలయ్యాయి. ప్రభాస్ లుక్స్ కానీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నపుడు కానీ టీజర్ వచ్చాక చాలానే వచ్చాయి.

అయితే ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న ట్రైలర్ విషయంలో మాత్రం పెద్ద బ్లండర్ జరిగింది. అఫీషియల్ గా ప్లాన్ చేసిన మొదటి ట్రైలర్ వచ్చే లోపే రెండో ట్రైలర్ సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. దీనితో అది వెంటనే వైరల్ గా మారిపోగా దీని తర్వాత థియేటర్స్ లో మొదటి ట్రైలర్ రిలీజ్ చేశారు.
సరే ఇది పక్కన పెడితే ఇపుడు రెండో ట్రైలర్ అఫీషియల్ గా వచ్చే లోపు మూడో ట్రైలర్ లాంటిది లీక్ అయ్యింది. నిన్న ముంబైలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మేకర్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి స్టార్ కాస్ట్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రభాస్ సహా, దీపికా లు హాజరయ్యారు. ఈ సమయంలో స్పెషల్ ట్రైలర్ ని స్క్రీనింగ్ చేశారు.

అయితే అప్పటికే ఆ ఈవెంట్ ని హోస్ట్ చేస్తున్న రానా దయచేసి ఎవరూ రికార్డు చెయ్యొద్దని చెప్పాడు కానీ ఎలాగో చేసేసి లీక్ చేసేసారు. మరి ఈ ట్రైలర్ మాత్రం మైండ్ బ్లోయింగ్ గా ఉందని చెప్పాలి. మొదటి రెండు ట్రైలర్ లలో లేని విజువల్స్ ఎక్కువ ఇందులో కనిపిస్తున్నాయి. అంతే కాకుండా ఇది ఫుల్ ఆన్ యాక్షన్ కట్స్ తోనే నిండిపోయింది అని చెప్పాలి.
ప్రభాస్ లోని అగ్రెసివ్ సీన్స్, అమితాబ్ పై సాలిడ్ యాక్షన్ ఎపిసోడ్ లు ఇంకా కమల్ లుక్ కూడా మరో యాంగిల్ నుంచి కనిపిస్తుంది. అలాగే దీపికా పదుకొనె నుంచి కూడా కొన్ని సీన్స్ కొత్తవి కనిపించాయి. ఇవి కాకుండా కొన్ని గ్రాండ్ సీక్వెన్స్ లు అయితే మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయని చెప్పి తీరాలి. ఖచ్చితంగా దర్శకుడు నాగ్ అశ్విన్ బిగ్ స్క్రీన్స్ పై ఒక ఊహించని ట్రీట్ ని ఆడియెన్స్ కి అందించబోతున్నాడని చెప్పవచ్చు.

మరి ఈ భారీ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, పశుపతి, (మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ) కూడా ఉన్నాడని కొన్ని అనఫీషియల్ రూమర్స్ ఉన్నాయి. అలాగే తమిళ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా వైజయంతి మూవీస్ నిర్మాణం వహించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా భాషల్లో 2D, 3D ఇంకా ఇమ్యాక్స్, 4DX ఫార్మాట్ లలో కూడా విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











