"పుష్ప 1" డిలీటెడ్ సీన్ చూసారా? మెంటల్ మాస్ సీన్ ఎందుకు తీసేసినట్టు.. నెట్టింట వైరల్
ఇపుడు పాన్ ఇండియా వైడ్ గా ఒకే ఒక్క సినిమా మానియా నడుస్తుంది అని చెప్పాలి. ఆ చిత్రం మరేదో కాదు మన తెలుగు సినిమా నుంచి వెళుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ సీక్వెల్ చిత్రమే "పుష్ప పార్ట్ 2 ది రూల్". ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్‌డమ్‌ని నార్త్ మార్కెట్ లో ఓ రేంజ్ లో చూపించిన సినిమా ఇది. మొన్న పాట్నాలో జరిగిన ఈవెంట్‌తో చాలా మంది హిందీ హీరోలకి నిద్ర లేకుండా చేసాడు అల్లు అర్జున్.
మరి ఈ తరహా హైప్ ని సెట్ చేసుకున్న సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఇపుడు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అయితే ఈ చిత్రం కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ఒక సర్ప్రైజ్ అయితే బయటకి వచ్చింది. ఏ సీక్వెల్ సినిమాకి అయినా దాని తాలూకా ఆరంభాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు అలానే పుష్ప 2 కి ముందు వచ్చిన పాన్ ఇండియా హిట్ చిత్రమే "పుష్ప పార్ట్ 1 ది రైజ్".

నిజానికి ఈ సినిమాలో బాహుబలి 1, కేజీఎఫ్ 1 లాంటి హై వోల్టేజ్ అండ్ బిగ్ ట్విస్ట్ క్లైమాక్స్ ఉండదు అయినప్పటికీ పుష్ప పార్ట్ 2 కి మాత్రం ఆకాశాన్ని అంటే క్రేజ్ నెలకొంది. పుష్ప 1 లో అలాంటి మోస్ట్ ఎగ్జైటింగ్ క్లైమాక్స్ లేకపోయినప్పటికీ దర్శకుడు సుకుమార్ తీసిన పలు సన్నివేశాలు మాత్రం రిపీట్స్ లో చూసినా బోర్ కొట్టవు. అది తన మ్యాజిక్, అలా పుష్ప 1 బిగ్ హిట్ కాగా అప్పట్లోనే ఆ సినిమా సుమారు 3 గంటల నిడివితో వచ్చింది.
అయితే ఈ సినిమా నుంచి ఒక మెంటల్ మాస్ క్రేజీ సీన్ ఇపుడు నెట్టింట వైరల్ అవుతుంది. పుష్ప 1 క్లైమాక్స్ లో భన్వర్ సింగ్ షెకావత్ ని పుష్ప కలవడానికి వెళ్ళినపుడు భన్వర్ ఎంత క్రూరుడో చూపించే సీన్ సినిమాలో హైలైట్ గా కనిపిస్తుంది. అయితే అందులోనే ఓ సీన్ ని డిలీట్ చేశారు. తన ఎంట్రీ ఉన్నపుడు ఓ గంజాయి గ్యాంగ్ ని ఫహద్ పట్టుకుంటాడు.

అయితే అందులో పేర్లు అడిగి ఒకొక్కరిని చంపేసినపుడు కార్ లో నుంచి దిగాక ఒకతను ఇద్దర్ని చంపేశాడు అంటూ అరుస్తాడు గుర్తుందా? అతన్ని పట్టుకొని పుష్ప రాజ్ ముందు తన బల ప్రదర్శన చూపిస్తాడు. ఈ సీన్ చెప్పడం కంటే చూస్తే మరింత ఎగ్జైటింగ్ గా కనిపిస్తుంది. ఆ పాత్ర పేరు కూడా అడిగి గొంతు దగ్గర గన్ పెట్టడం, తుపాకీ పేలకపోతే బ్రహ్మాజీతో సెట్ చేయించి తీసుకొని అతనిని వదిలేస్తాడు. ఇదంతా ఓపిగ్గా పుష్ప అండ్ గ్యాంగ్ చూస్తూ ఉంటారు.
మరి ఇలాంటి ఒక క్రేజీ సీన్ ని మేకర్స్ నిడివి మూలాన డిలీట్ చేసినట్టు ఉన్నారు. దాదాపు ఇది ఉంది అని చాలా మందికి తెలియదు కానీ ఇప్పుడెలా వచ్చింది అంటే పార్ట్ 1 విడుదల అప్పుడు యూఎస్ కి పంపిన కంటెంట్ లో ఈ సీన్ ఉందట. అప్పటిది ఇపుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. కాగా ఇపుడు పార్ట్ 1 రీ రిలీజ్ కి కూడా తీసుకొస్తున్నారు మరి అందులో ఏమన్నా యాడ్ చేస్తారేమో చూడాలి.


Click it and Unblock the Notifications











