twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    HBD Gowtam బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ హీరోగా.. అదిరిపోయే కాన్సెప్ట్‌తో ఎస్ ఒరిజినల్స్ మూవీ

    |

    సినిమా రంగంలో హాస్య బ్రహ్మ‌గా సుపరిచితులైన బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ హీరోగా నటించి ప్రేక్షకులను మెప్పించడం తెలిసిందే. మను, బసంతి లాంటి చిత్రాలు ఆయన నటనా ప్రతిభకు మచ్చు తునకగా మారాయి. లాక్‌డౌన్, తదితర కారణాల వల్ల కొంత గ్యాప్ తీసుకొన్న గౌతమ్ మళ్లీ హీరోగా ఓ విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తన సరికొత్త చిత్రానికి సంబంధించిన సినిమా గ్లిమ్స్‌ని గౌతమ్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

    విభిన్నమైన కథ, విలక్షణమైన చిత్రాలతో టాలీవుడ్‌లో ప్రత్యేక ముద్రను వేసుకున్న యస్ ఒరిజినల్స్ బ్యానర్ నుంచి ప్రోడక్షన్ నంబర్ 10 గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో సుబ్బు చెరుకూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఒక బ్లాంక్ స్క్రీన్‌పై మొదలైన వాయిస్‌తో 'ఒంటరితనం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా' అనే డైలాగ్‌తో గౌతమ్ లుక్ రిలీవ్ అవుతుంది.

    HBD Gowtam: S Originals to produce Brahmanandam Son Gowtam As Hero

    ఈ డైలాగ్‌ సినిమాలోని ఇంటెన్సినిటీ తెలియజేసింది. గౌతమ్ పోషించే క్యారెక్టర్‌కు సంబంధించిన భావోద్వేగాన్ని తెలియజేసింది. అలాగే గౌతమ్ లుక్స్ కూడా రచయిత క్యారెక్టర్‌ని ఫరెఫెక్ట్‌గా మ్యాచ్ చేసే విధంగా ఉన్నాయి.

    మను చిత్రంతో నటుడిగా తన రేంజ్‌తో ప్రేక్షకులను మెప్పించిన గౌతమ్ ఈ సారి మరో కొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధమయ్యాడు. మోనోఫోబియాతో
    బాధపడుతున్న రచయితగా ఈ సినిమాలో కనిపించనున్నారు. ఒక ప్రమాదం అతని జీవితాన్ని ఎలా మార్చింది? తను ఎదుర్కొంటున్న సమస్య మరో పెద్ద సమస్యకు కారణం అయితే దాన్ని అతను ఎలా అధిగమించాడు? అనే థ్రిలింగ్ పాయింట్స‌తో కథ సాగబోతున్నది అని చిత్ర యూనిట్ చెబుతుంది.

    గౌతమ్ నటించే సినిమా కాన్సెప్ట్ బేస్‌గా సాగుతుంది. విలక్షణంగా తెరకెక్కిచడంలో దర్శకుడిగా సుబ్బు చెరుకూరి తనదైన ముద్రను వేశాడని చిత్ర యూనిట్ అంటుంది. ఎస్ ఒరిజినల్స్ పతాకంపై సృజన్ యరబోలు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరిషెడ్యూల్ జరుపుకుంటుంది.

    నటీనటులు, ఇతర వివరాలు త్వరలోనే చిత్ర యూనిట్ తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.
    సంగీతం: ఎమ్ యస్ జోన్స్ రూపెర్ట్
    సినిమాటోగ్రఫి: మోహన్ చారి
    నిర్మాత: సృజన్ యరబోలు
    దర్శకత్వం సుబ్బు చెరుకూరి

    English summary
    Actor Brahmanandam Son Gowtam celebrated his birth day on March 2nd. In this occassion, S Original production house released movie glims.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X