HBD Kiran Abbavaram.. సెబాస్టియన్ PC 524 రిలీజ్ ఎప్పుడంటే.. క్రేజీ హీరో మూవీ పక్కగా థియేటర్‌లోనే!
టాలీవుడ్‌లో రెండు హిట్లతో మంచి క్రేజ్ సంపాదించకొన్న కిరణ్ అబ్బవరం అదే జోష్‌ను కొనసాగిస్తూ హ్యాట్రిక్ కొట్టేందుకు మూడో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రాజా వారు రాణి గారు, ఎస్ఆర్ కల్యాణ మండపం చిత్రాలతో తన రేంజ్‌ను పెంచుకొన్నారు. 2021లో రిలీజైన చిన్న చిత్రాల్లో భారీ లాభాలను సొంతం చేసుకొన్న ఎస్ఆర్ కల్యాణమండపం తర్వాత కిరణ్ ప్రస్తుతం సెబాస్టియన్ పీసీ 524 అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ మేరకు కిరణ్ అబ్బవరం పుట్టిన రోజును పురస్కరించుకొని అధికారికంగా ప్రకటనను రిలీజ్ చేశారు.
సెబాస్టియనన్ పీసీ 524 చిత్రానికి సంబంధించిన యూనిట్ అధికారికంగా ప్రకటనను రిలీజ్ చేస్తూ ఈ సినిమాను ఫిబ్రవరి 25వ తేదిన అధికారికంగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం అని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ సినిమా రిలీజ్‌పై వస్తున్న ఊహాగానాలు, రూమర్లను నమ్మద్దొని పరోక్షంగా ప్రకటనలో హింట్ ఇచ్చారు.

ఎస్ఆర్ కల్యాణమండపం తర్వాత కిరణ్ అబ్బవరం నటించిన సెబాస్టియనన్ పీసీ 524 వస్తుండటంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని బలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, యూవీ క్రియేషన్ బ్యానర్‌పై ప్రమోద్, రాజు నిర్మిస్తున్నారు. బీ సిద్దారెడ్డి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఇదిలా ఉండగా, కిరణ్ అబ్బవరం నటించిన సమ్మతమే చిత్రం, వినరో భాగ్యము విష్ణు కథ అనే చిత్రాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











