HBD Mahesh Babu: గుంటూరు కారం నుంచి ఊరమాస్ పోస్టర్.. అయినా ఫ్యాన్స్‌కు నిరాశే
సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నింటికీ మించి హ్యాండ్సమ్ లుక్స్‌తో చాలా తక్కువ సమయంలోనే బడా హీరోగా ఎదిగిపోయాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. అదే ఉత్సాహంతో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు అతడు 'గుంటూరు కారం' మూవీ చేస్తున్నాడు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న మాస్ మసాలా చిత్రమే 'గుంటూరు కారం'. చాలా గ్యాప్ తర్వాత వీళ్లిద్దరి మధ్య సినిమా వస్తుండడంతో దీనిపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయన్న విషయం తెలిసిందే. అందుకు ఏమాత్రం తీసిపోకుండానే ఈ క్రేజీ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

పూర్తి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'గుంటూరు కారం' సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ చాలా నెలల క్రితమే ప్రారంభం అయింది. కానీ, అనుకోని అవాంతరాలు ఎదురు కావడంతో చిత్రీకరణ సజావుగా సాగడం లేదు. ఫలితంగా ఈ చిత్రం విషయంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిపై మహేశ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.
ఇక, ఆగస్టు 9వ తేదీన సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. దీంతో 'గుంటూరు కారం' మూవీ నుంచి మంచి ట్రీట్ కోసం అతడి అభిమానులు అందరూ వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అర్ధారాత్రి 12:06 గంటలకే ఈ చిత్రం నుంచి ఓ ఊరమాస్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో మహేశ్ లుంగీలో స్మోకింగ్ చేస్తూ కనిపించాడు. వాస్తవానికి 'గుంటూరు కారం' మూవీ నుంచి తాజాగా విడుదలైన పోస్టర్ హై రేంజ్‌లోనే ఉన్నా.. ఇంకా వేరేది ఎక్స్‌పెక్ట్ చేసిన ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు.

ఇదిలా ఉండగా.. 'గుంటూరు కారం' సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల అయ్యే ఛాన్స్ ఉంది.


Click it and Unblock the Notifications











