ఇక మొదలుపెట్టా.. ఆ బాధ్యత అంతా మీపైనే.. ఫ్యాన్స్‌కు నాగార్జున మెసేజ్

టాలీవుడ్ మన్మథుడు, కింగ్ ఆఫ్ రొమాన్స్ నాగార్జున తన జన్మదినాన్ని జరుపుకొంటున్నారు. కరోనావైరస్ పరిస్థితుల కారణంగా కుటుంబ సభ్యులతోనే వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులతోపాటు.. అభిమానులు, నెటిజన్లు జన్మదిన శుభాకాంక్షలను అందిస్తున్నారు. ఆగస్టు 29వ తేదీ నాగ్ బర్త్ డే కావడంతో అభిమానులు ఆయన పేరిట హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా నాగ్ తనకు జన్మదిన శుభాకాంక్షలు అందిస్తున్న వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఓ ప్రకటనను విడుదల చేశారు. నా పుట్టిన రోజున శుభాకాంక్షలు అందిస్తున్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. నేను ఈ రోజు 31వ బర్త్ డేను జరుపుకొంటున్నాను (టాలీవుడ్‌లో 31వ బర్త్ డే) అని చమత్కరించారు. నిన్నటి నుంచే నా అభిమానులు, శ్రేయోభిలాషులు నాకు ప్రేమానురాగాలతో విషెస్ తెలియజేస్తున్నారు. దాంతో నేను చాలా ఆనందంలో మునిగిపోయాను. అందుకు సీనియర్ అక్కినేని, జూనియర్ అక్కినేని ఫ్యాన్స్‌కు థ్యాంక్స్ అని ఓ ప్రకటనలో తెలిపారు.

HBD Nagarjuna: I joined the shoot of Bigg Boss Season 4

మరో సంతోషకరమైన వార్తను మీతో పంచుకోవాలనుకొంటున్నాను. ఐదు నెలల తర్వాత మళ్లీ పని మొదలుపెట్టాను. బిగ్‌బాస్ సీజన్ 4 కోసం నేను షూటింగ్ మొదలుపెట్టాను. గతేడాది తెలుగు బిగ్‌బాస్‌ సీజన్ 3కి హోస్ట్‌గా పనిచేశాను. ఆ సమయంలో మీరందించిన ప్రోత్సాహం మరిచిపోలేనిది. ఆ షోను మీరు ఎంతో సక్సెస్ చేశారు. అందుకు నేను రుణపడి ఉంటాను. గతంలో మాదిరిగానే నాలుగో సీజన్‌ను కూా మరింత సక్సెస్ చేయండి. ప్రేమానురాగాలతో అందులో పార్టిసిపేట్ చేయండి. మీతోపాటు బిగ్ బాస్ సీజన్ 4 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని నాగార్జున చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X