HBD Neha Shetty గ్లామరస్ లుక్‌తో అదరగొట్టిన డీజే టిల్లు భామ.. బెదురులంక 2012 ఫస్ట్‌లుక్‌లో చిలిపిగా!

డీజే టిల్లు సినిమాతో భారీగా ఫాలోయింగ్ కూడగట్టుకొన్న అందాల భామ నేహా శెట్టి డిసెంబర్ 5వ తేదీన జన్మదినాన్ని ఘనంగా జరుపుకొంటున్నారు. నేహా శెట్టి పుట్టిన రోజున పురస్కరించుకొని ఆమె నటించిన తాజా చిత్రం బెదురులంక 2012 సినిమా యూనిట్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది. బెదురులంక సినిమాలో నేహా శెట్టి లుక్ విషయానికి వస్తే..

పింక్ కలర్ చీరలో తడిసిన జుట్టుతో చిలిపిగా కళ్లతో కవ్విస్తూ కనిపించింది. ట్రెడిషినల్ లుక్‌లో ఆధునిక ఆలోచనలు ఉన్న యువతి అంటూ దర్శకుడు క్లాక్స్ మీడియాకు వెల్లడించారు. ఈ చిత్రంలో శివ అనే యువకుడి ప్రియురాలిగా చిత్ర పాత్రలో నేహా శెట్టి కనువిందు చేయబోతున్నారు.

HBD Neha Shetty: DJ Till girl looks chirpy in Bedurulanka 2012 first look

విభిన్నమైన కథ, కథనాలతో రూపొందుతున్న బెదురులంక సినిమాలో నేహా శెట్టి తన ఇమేజ్ భిన్నంగా ఎమోషనల్ పాత్రలో కనిపిస్తారనే ప్రచారం మీడియాలో జరుగుతున్నది. యుగాంతం థీమ్‌తో పక్కా గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతున్నది. గోదావరి బ్యాక్ డ్రాప్‌లో కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. యానాం, కాకినాడ, గోదావరి తీర ప్రాంతంలో షూటింగు జరుపుకొన్న ఈ చిత్రం రిలీజ్‌కు ముస్తాబుతున్నది.దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ "సంప్రదాయబద్ధంగా కనిపించే మోడ్రన్ అమ్మాయి చిత్ర. పైకి బార్బీ బొమ్మలా కనిపిస్తుంది కానీ... లోపల ఆర్డీఎక్స్ బాంబ్ లాంటి మనస్తత్వం ఆమెది. అందంగా కనిపిస్తూ... అభినయంతో నేహా శెట్టి ఆకట్టుకుంటారు. కార్తికేయ, నేహా కాంబినేషన్... వాళ్ళిద్దరి సీన్స్ అందర్నీ ఆకట్టుకుంటాయి. డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్ చిత్రమిది. ఒక ఊరు నేపథ్యంలో వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథతో సినిమా రూపొందిస్తున్నాం" అని చెప్పారు.

చిత్రనిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ "మా హీరోయిన్ నేహా శెట్టి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సినిమాలో ఆమె రోల్ చాలా బావుంటుంది. కార్తికేయ, నేహా శెట్టి కాంబినేషన్ చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. వినోదాత్మక చిత్రమిది. చిత్రీకరణ దాదాపు పూర్తి కావొచ్చింది. త్వరలో సినిమా కంప్లీట్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. కొత్త ఏడాదిలో చిత్రాన్ని విడుదల చేస్తాం. థియేటర్లలో ప్రేక్షకులు కొత్త సినిమా చూస్తారు. డ్రామా, కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ సినిమాలో మెయిన్ హైలైట్స్ అవుతాయి'' అని చెప్పారు.

కర్ణాటకలోని మంగళూరులో జన్మించిన నేహా శెట్టి 2016లో ముంగారు మేల్ 2 చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2018లో మెహబూబా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, డీజే టిల్లు సినిమాలో నటించింది. ఇంకా పలు చిత్రాల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X