ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 20న కిక్కెక్కించే వార్త.. రూ.150 కోట్లతో..
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ జన్మదినమంటే నందమూరి ఫ్యాన్స్‌కు ప్రత్యేకమైన పండగే. ఇక వేడుక రోజున అంతకుమించిన వార్త వస్తే ఇంకా అభిమానులకు ఆనందానికి హద్దే ఉండదు. గత రెండు, మూడేళ్లుగా కెరీర్ పరంగా దూసుకెళ్తున్న ఎన్టీఆర్ మరో క్రేజీ ప్రాజెక్టులో భాగమవతున్నారు. ఆ వార్తను మే 20వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నారు. ఇంతకు ఆ క్రేజీ ప్రాజెక్టు వివరాలు ఏమిటంటే..

ట్రెండింగ్‌గా ఎన్టీఆర్ బర్త్ డే
మే 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ తన 37వ ఏట ప్రవేశిస్తున్నారు. అరవింద సమేత లాంటి బ్లాక్‌బస్టర్.. అలాగే RRR లాంటి ప్రాజెక్టులో భాగమైన సమయంలో వస్తున్న ఈ పుట్టిన రోజు వేడుక ప్రత్యేకం కానున్నది. ఇప్పటికే అభిమానులు ఎన్టీఆర్ బర్త్ డే హ్యాష్ ట్యాగ్‌ను సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మలిచారు. ఇప్పటి నుంచి ఎన్టీఆర్ వేడుకకు అన్ని రకాలుగా సిద్దం చేస్తున్నారు.

ప్రశాంత్ నీల్‌తో ప్రాజెక్ట్
ఇక తన పుట్టిన రోజున ఎన్టీఆర్ అభిమానులకు సంతోషకరమైన వార్తను పంచడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తన కెరీర్‌లో 31వ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేశారు. త్రివిక్రమ్‌తో అయిననూ హస్తినకు పోయి రావలెను సినిమా తర్వాత కేజీఎఫ్ లాంటి సంచలన విజయాన్ని అందుకొన్న ప్రశాంత్ నీల్‌తో సినిమాను చేయబోతున్నట్టు అనధికారికంగా వార్త వైరల్ అవుతున్నది.

తొలి ప్యాన్ ఇండియా మూవీగా
ఎన్టీఆర్ కెరీర్‌లో డైరెక్ట్‌గా తొలి ప్యాన్ ఇండియా మూవీని చేయబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా పూర్తిస్థాయి యాక్షన్, థ్రిల్లర్‌గా తెరకెక్కనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా కథను పూర్తిస్థాయిలో ఎన్టీఆర్‌కు చెప్పగా ఆయన సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఈ చిత్రంలో వీర మాస్‌గా ఎన్టీఆర్ కనిపించబోతున్నట్టు ఫిలింనగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతున్నది.

150 కోట్ల బడ్జెట్‌తో
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్టును ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాను సుమారు రూ.150 కోట్ల బడ్జెట్‌తో భారీ హంగులతో తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా విదేశాల్లోను. దేశంలోనే ప్రధాన ప్రాంతాల్లో ఈ షూటింగ్‌ను జరిపేందుకు ఇప్పటికే పక్కా ప్లాన్‌ను రూపొందించినట్టు తెలుస్తున్నది.
Recommended Video

బాలీవుడ్ హీరోయిన్, ఇతర నటీనటులు
ఇక అంతేకాకుండా ఎన్టీఆర్ తన ఇమేజ్‌కు భిన్నంగా, ఇప్పుడు ఉన్న లుక్‌కు డిఫరెంట్‌గా ఈ సినిమాలో కనిపించనున్నట్టు తెలుస్తున్నది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెడుతున్నట్టు తెలిసింది. అలాగే బాలీవుడ్ నుంచి ఓ క్రేజీ హీరోయిన్‌ను, పలువురు బాలీవుడ్ నటులను తీసుకొంటున్నట్టు తెలుస్తున్నది. ఈ వార్తలన్నీకి మే 20న అధికారికంగా ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











