HBD Pawan Kalyan: ఊరమాస్‌గా వీరమల్లు.. మతిపోగొట్టేలా కొత్త సర్‌ప్రైజ్

టాలీవుడ్‌లోనే టాప్ హీరో అయినా.. మరెవరూ చేయనంత వేగంగా సినిమాలను పూర్తి చేస్తూ.. అటు అభిమానులను, ఇటు సినీ ప్రియులను అలరిస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. రీఎంట్రీలో ఫుల్ స్పీడ్‌తో దూసుకుపోతోన్న ఈ మెగా హీరో.. ఇప్పటికే కొన్ని సినిమాలతో వచ్చి బాక్సాఫీస్ బెండు తీశాడు. అదే సమయంలో మరికొన్ని ప్రాజెక్టులను కూడా ఎప్పుడో మొదలు పెట్టేశాడు. అందులో చారిత్రక నేపథ్యంతో రాబోతున్న 'హరిహర వీరమల్లు' ఒకటి. మొగల్ సామ్రాజ్య కథతో రాబోతున్న ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే.

క్రేజీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ చాలా ఏళ్ల క్రితమే ప్రారంభం అయింది. కానీ, పవన్ కల్యాణ్ డేట్స్ దొరకకపోవడం, కోవిడ్ లాక్‌డౌన్స్‌తో పాటు చాలా కారణాల వల్ల షూటింగ్‌కు ఆటంకాలు ఎదురయ్యాయి. దీంతో చిత్రీకరణ సజావుగా సాగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో టాకీ పార్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. కానీ, పవన్ మాత్రం దీనికి ప్రాధాన్యం ఇవ్వనట్లు తెలుస్తోంది. ఇలా ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ కూడా నిారశగా ఉన్నారు. ఈ నేపథ్యంలో దీని నుంచి అదిరే ట్రీట్ వచ్చింది.

Harihara Veeramallu

క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న 'హరిహర వీరమల్లు' మూవీ నుంచి తాజాగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈరోజు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు. దీన్ని పురుస్కరించుకుని అర్ధరాత్రి 12:17 గంటలకు దీన్ని వదిలారు. ఇందులో పవన్ కల్యాణ్ ఊరమాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. అలాగే, స్టైలిష్ వాకింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇక, ఈ పోస్టర్ బ్యాగ్రౌండ్‌లో ప్రత్యర్థులు దెబ్బలు తిని పడిపోయి ఉండడం కనిపించింది. మొత్తానికి పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు బర్త్‌డే రోజు ఊహించని సర్‌ప్రైజే వచ్చిందని చెప్పాలి.

Harihara Veeramallu Brand New Poster

ఇక.. పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న 'హరిహర వీరమల్లు' సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాషల్లో రూపొందుతోంది. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్‌గా.. నిధి అగర్వాల్ కీలక పాత్రను చేస్తోంది. ఆస్కార్ గ్రహీత కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X