HBD Prabhas: ఐరన్ హ్యాండ్‌తో ప్రభాస్.. Project K నుంచి అదిరిపోయే ట్రీట్
గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ జెట్ స్పీడుతో దూసుకుపోతోన్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన తర్వాత ఎన్నో భారీ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన అతడు.. ఇప్పుడు చేతిలో మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఈ స్టార్ హీరో నటిస్తోన్న చిత్రాల్లో 'Project K' ఒకటి. 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో బిగ్ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమా టైం ట్రావెల్ కాన్సెప్టుతో రాబోతుంది. దీంతో ఈ సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి.
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రానున్న 'Project K' సినిమాను పాన్ వరల్డ్ రేంజ్‌తో తీస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా కాలం పాటు జరిగింది. అలాగే, ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభం అయింది. అంతేకాదు, ఇప్పటికే చిత్ర యూనిట్ హీరో ప్రభాస్, హీరోయిన్ దీపికా పదుకొనేతో పాటు కొందరు కీలక నటులతో పలు షెడ్యూళ్లను కూడా పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్ వచ్చేసింది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నేడు పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో 'Project K' మూవీ యూనిట్ అతడికి శుభాకాంక్షలు తెలియజేసింది. అదే సమయంలో ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్‌ను అందించింది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఈ మూవీ యూనిట్ ఓ పోస్టర్‌ను వదిలింది. ఇందులో ఈ స్టార్ హీరో పాత్రకు సంబంధించిన ఐరన్ హ్యాండ్ కనిపించింది. అంతేకాదు, ఈ పోస్టర్‌పై 'హీరోలు స్వతహాగా జన్మించరు.. ఎదుగుతారు' అనే కొటేషన్ కూడా కనిపించింది. మొత్తానికి ఈ ట్రీట్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'Project K' సినిమా టైమ్ మెషీన్ ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అత్యంత ముఖ్యమైన సైంటిస్ట్ పాత్రను చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఈ చిత్రం దిశా పటానీ సహా ఎంతో మంది ప్రముఖులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











