Salaar: ప్రభాస్‌తో పోటీకి సై అంటున్న వరదరాజ.. ఇంత భయంకరంగా ఉన్నాడేంటి!
హిందీ మినహా మిగిలిన భాషల్లో పోల్చుకుంటే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచే ఎక్కువగా పాన్ ఇండియా చిత్రాలు వస్తున్నాయి. అవన్నీ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. అయితే, అందులో కొన్ని మాత్రం విపరీతమైన బజ్‌ను ఏర్పరచుకుంటున్నాయి. అలాంటి వాటిలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న 'సలార్' ఒకటి.
పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో హై ఓల్టేజ్ యాక్షన్‌తో రాబోతున్న 'సలార్' మూవీపై ఆరంభం నుంచీ అంచనాలు ఉన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మొదట ఒక భాగంగానే దీన్ని తీసుకు రావాలని అనుకున్నా.. లెంగ్త్ ఎక్కువ కావడంతో రెండు పార్టులుగా ఈ చిత్రాన్ని రూపొందించారు. అందులో 'సలార్: సీజ్‌ఫైర్'ను ముందు తెస్తున్నారు.

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'సలార్' మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తైంది. అప్పటి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తూనే వస్తున్నారు. అదే సమయంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలనూ ప్రారంభించారు. ఇలా ఇప్పటికే దీని నుంచి కొన్ని పోస్టర్లతో పాటు ఓ టీజర్‌ను కూడా విడుదల చేశారు. వీటికి మంచి రెస్పాన్స్ లభించింది.
'సలార్' మూవీని డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. దీంతో వీలైనంత ఎక్కువ ప్రమోషన్ చేయాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఏదైనా ట్రీట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. అంతలోనే ఇప్పుడు ఈ పాన్ ఇండియా మూవీ నుంచి ఓ అదిరిపోయే కానుకను అందించారు.
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'సలార్' మూవీలో మలయాళ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు అతడి పుట్టినరోజును పురస్కరించుకుని ఈ చిత్రం నుంచి ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో పృథ్వీరాజ్ భయపెట్టే గెటప్‌తో కనిపించాడు. ఇక, ఈ చిత్రంలో అతడు వరదరాజ మన్నార్ అనే పాత్రను చేస్తున్నట్లు కూడా రివీల్ చేశారు.
ఇదిలా ఉండగా.. 'సలార్' చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా చేస్తుండగా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్నాడు.


Click it and Unblock the Notifications











